Bjp
Disaccord In the BJP : తెలంగాణ బీజేపీలో అసమ్మతి రాగం మొదలైంది. అది కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సొంత జిల్లా కరీంనగర్‌లోనే స్టార్ట్ అయ్యింది. ఏకంగా అసమ్మతి నేతలంతా రహస్యంగా భేటీ కావడం కాకరేపుతోంది. దీంతో ఈ ఇష్యూను బీజేపీ జాతీయ నాయకత్వం సీరియస్‌గా తీసుకుంది. రహస్య భేటీపై నివేదిక ఇవ్వాలని జాతీయ నాయకత్వం తరుణ్ చుగ్‌ను ఆదేశించింది. దీంతో నివేదిక తెప్పించుకునే పనిలో తరుణ్ చుగ్ నిమగ్నమయ్యారు. ఒకట్రెండు రోజుల్లో హైకమాండ్‌కు నివేదిక పంపనున్నారు.
బండి సంజయ్ ఇలాకాలో సొంత పార్టీకి చెందిన కొంతమంది నేతలు రెండు రోజుల క్రితం రహస్యంగా సమావేశమయ్యారు. గత పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీ తమను పట్టించుకోవడం లేదని కరీంనగర్ జిల్లా స్థానిక నేతలు ఆరోపణలు చేస్తున్నారు. బండి సంజయ్ స్థానిక కార్యక్రమాలకు తమకు సమాచారం ఇవ్వడం లేదని, కొత్తగా పార్టీలో చేరిన వారికి ఇచ్చిన గుర్తింపు తమకు దక్కడం లేదని ఆత్మగౌరవ సమావేశం నిర్వహించారు. అందులో పలు అంశాలపై చర్చించారు.
Covid Vaccine : పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తి కొవిడ్ టీకాతో కోలుకున్నాడు
వీరంతా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీలో అసంతృప్తితో ఉన్న నేతలను కలుపుకొని ఆత్మగౌరవ సమావేశాలను నిర్వహించాలని ఆలోచన చేసినట్లు అధిష్టానం దృష్టికి వెళ్లింది. దీంతో బీజేపీ అధిష్టానం ఈ భేటీపై సీరియస్ అయ్యింది. అధికార టీఆర్ఎస్‌తో లోపాయికారీ ఒప్పందంలో భాగంగానే రహస్య సమావేశమయ్యారని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు రాష్ట్ర అగ్రనేతలు. ఇంతటితో కట్టడి చేయకపోతే పార్టీకి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్న జాతీయ నాయకత్వం చర్యలకు సిద్ధం అయ్యింది.