Telangana Assembly Election 2023 : పోటాపోటీగా ఓటరు స్లిప్పుల పంపిణీ.. ఇంటింటికి కార్యకర్తల బృందాలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపించిన నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లకు స్లిప్పులను పంపిణీ చేస్తున్నాయి. మంగళవారంతో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడనుండటంతో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల బృందాలు ఇంటింటికి వచ్చి పోలింగ్ చిట్టీలను అందించి తమ పార్టీ అభ్యర్థికే ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు....

voter slips

Telangana Assembly Election 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపించిన నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లకు స్లిప్పులను పంపిణీ చేస్తున్నాయి. మంగళవారంతో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడనుండటంతో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల బృందాలు ఇంటింటికి వచ్చి పోలింగ్ చిట్టీలను అందించి తమ పార్టీ అభ్యర్థికే ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. వాస్తవానికి ఓటర్లకు పోలింగ్ స్లిప్పులను పోలింగ్ తేదీకి అయిదు రోజుల ముందే పంపిణీ చేయాలి. అంగన్ వాడీ కార్యకర్తలున్న ప్రాంతాల్లో వారి ద్వారా ఈ పోలింగ్ చిట్టీలు బీఎల్‌ఓలు పంపిణీ చేయించారు.

ALSO READ : Earthquake : మూడు దేశాల్లో భారీ భూకంపం…సునామీ ముప్పు లేదు

గ్రేటర్ హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ స్లిప్పుల పంపిణీ సజావుగా సాగలేదు. రాజకీయ పార్టీ అభ్యర్థుల పేరిట ప్రచారంతో పోలింగ్ చిట్టీలను పంపిణీ చేయరాదని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఒక వైపు ఎన్నికల కమిషన్ ఓటర్లకు పోలింగ్ స్లిప్పులు అందించక పోవడంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ పార్టీ గుర్తులతో కూడిన స్లిప్పులను ముద్రించి అందజేస్తున్నారు.

ALSO READ : Today Headlines : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో ఇవాళ సుప్రీంలో విచారణ .. తెలంగాణ, ఏపీకి వర్ష సూచన

ఇంటింటికి వచ్చి పోలింగ్ స్లిప్పులతో పాటు కొన్ని పార్టీల కార్యకర్తలు ఓటర్లకు డబ్బులు, బహుమతులు సైతం పంచుతున్నారని సమాచారం. మరికొందరు అభ్యర్థులు ఓటర్ల మొబైల్ ఫోన్లకు పోల్ స్లిప్పులను వాట్సాప్ మెసేజుల రూపంలో పంపిస్తున్నారు. ఒక వైపు పోలింగ్ చిట్టీల పంపిణీతోపాటు తమ పార్టీ అభ్యర్థిపేరు, ఎన్నికల గుర్తును ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో పోలింగ్ చిట్టీల పంపిణీ కోసం ప్రధాన రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాల వారీగా ప్రత్యేక కార్యకర్తల బృందాలను ఏర్పాటు చేసింది.

ALSO READ : తెలుగులో నినాదాలు చేసిన ప్రియాంక గాంధీ..

తెలంగాణలో 10 లక్షలకు పైగా ఓటర్లకు ఇంకా ఓటరు గుర్తింపు కార్డులు అందలేదు. దీంతో ఓటర్ల ఐడీతోపాటు రాజకీయ పార్టీలు పంపిణీ చేసిన ఓటర్లు స్లిప్పులే ఓటు వేసేందుకు ఉపయోగపడనున్నాయి. ఓటర్లకు పోలింగ్ స్లిప్పుల పంపిణీతో పాటు పోల్ మేనేజ్ మెంటుపై అన్ని రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి.

ట్రెండింగ్ వార్తలు