అనాథ యువతికి పెళ్లి పెద్దగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

మానస వివాహం జరిపించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

Collector Sri Harsha

ఓ అనాథ యువతికి పెళ్లి పెద్దగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష వ్యవహరించనున్నారు. మానస అనే అమ్మాయి తల్లిదండ్రులను కోల్పోవడంతో రామగుండంలోని తబిత బాలల సంరక్షణ కేంద్రంలో ఉంటోంది.

అదే కేంద్రంలో ఆమె చెల్లి కూడా పెరిగింది. 16 ఏళ్లుగా ఆ కేంద్రంలో ఉంటున్న మానసకు ఇటీవల జనగామ జిల్లాలోని రఘనాథపల్లికి చెందిన రాజేశ్‌ అనే యుకువడితో పెళ్లి కుదిరింది. మే 21న పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు.

Also Read: ఇండియాకు ట్రంప్‌ భారీ దెబ్బ.. ఆపిల్‌ కంపెనీ భారత్‌కు రాకుండా.. ఇండియాలో ఆపిల్‌ విస్తరణకు ఇక బ్రేక్?

మానస వివాహం జరిపించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. కలెక్టరేట్‌లోని వెంకటేశ్వరస్వామి మందిరంలో పెళ్లి జరగనుంది. ఈ వివాహాన్ని జిల్లా సంక్షేమశాఖ అధికారి వేణుగోపాల్‌రావుతో పాటు అదనపు కలెక్టర్లు, బాలల పరిరక్షణ ఆఫీసర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు జరిపిస్తున్నారు. మానసకు పెళ్లిపెద్దగా వ్యవహరించేందుకు శ్రీహర్ష ముందుకు వచ్చారు.