హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పరిధిలో డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ అధికారులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నానక్ రామ్ గూడాలో కారులో తరలిస్తున్న 20 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
ఒడిశాలోని మాల్కన్ గిరి జిల్లాకు చెందిన బిక్రం హిరా (24) నగరానికి గంజాయి తరలిస్తుండగా 13 డ్రై గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఒక నిందితుడు తప్పించుకునని పారిపోయాడని వివరించారు. గంజాయి తరలిస్తున్న టాటా విస్టా కారును సీజ్ చేసినట్లు తెలిపారు.
మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ మాట్లాడుతూ.. చందానగర్, బాలానగర్ పోలీసుల ఆధ్వర్యంలో సంయుక్త ఆపరేషన్ నిర్వహించామని తెలిపారు. ఒడిశా మాల్కన్ గిరి జిల్లాకు చేందిన బిక్రం హిరా నగరానికి 20 కేజీల 13 డ్రై గంజాయి ప్యాకెట్లు తెచ్చాడని, ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశామని చెప్పారు. ఢిల్లీ, హరియాణా, ఒడిశా రాష్ట్రాలకు వారు గంజాయి సరఫరా చేస్తున్నారని అన్నారు.
BV Raghavulu: అదానీ ఆఫర్‌ని సీఎం రేవంత్ అందుకే తిరస్కరించారు: బీవీ రాఘవులు