BV Raghavulu: అదానీ ఆఫర్‌ని సీఎం రేవంత్ అందుకే తిరస్కరించారు: బీవీ రాఘవులు

ప్రతిపక్షాలు లేవనెత్తిన సమస్యలపై పార్లమెంట్లో ప్రధాని మోదీ ప్రభుత్వం చర్చకు రానివ్వడం లేదని తెలిపారు.

BV Raghavulu: అదానీ ఆఫర్‌ని సీఎం రేవంత్ అందుకే తిరస్కరించారు: బీవీ రాఘవులు

Updated On : December 1, 2024 / 3:40 PM IST

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. అదానీపై వ్యతిరేకంగా ఉన్నందుకే సీఎం రేవంత్ రెడ్డి అదానీ ఆఫర్‌ని తిరస్కరించారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రజా సమస్యలు చర్చకు రావడం లేదని చెప్పారు. సంగారెడ్డిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

ప్రతిపక్షాలు లేవనెత్తిన సమస్యలపై పార్లమెంట్లో ప్రధాని మోదీ ప్రభుత్వం చర్చకు రానివ్వడం లేదని తెలిపారు. అదానీ ముడుపుల కుంభకోణం, మణిపూర్ అల్లర్లపై కేంద్ర ప్రభుత్వం నోరు విప్పడం లేదని చెప్పారు. ముడుపుల కుంభకోణం నుంచి అదానీని రక్షించడానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని అన్నారు.

జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి అదానీ వ్యవహారం తేల్చాలని డిమాండ్ చేశారు. చిన్న చిన్న సమస్యలపై స్పందించే ప్రధాని మోదీ మణిపూర్ సందర్శనకి మాత్రం వెళ్లలేదని చెప్పారు. ఆ సమస్యపై కనీసం మాట్లాడలేదని అన్నారు.

లగచర్ల ఫార్మాసిటీ, నిర్మల్ జిల్లా ఇథనాల్ ఫ్యాక్టరీలపై ప్రభుత్వం వెనక్కి తగ్గిందంటే రైతుల పోరాటమేనని తెలిపారు. వామపక్ష పార్టీలు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూనే ఉంటాయని తెలిపారు. జనవరిలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సీపీఎం రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయని అన్నారు.

కేటీఆర్, హరీశ్‌ రావుకు నిద్ర పట్టలేదు.. అందుకే ఇలాంటి ప్రచారం చేస్తున్నారు: జూపల్లి కృష్ణారావు