Kavitha : కాంగ్రెస్ 3 గంటల కరెంంట్ కావాలా? బీఆర్ఎస్ 24 గంటల కరెంట్ కావాలా? : కవిత

ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. తెలంగాణకు గాంధీ కుటుంబం తీరని మోసం చేసిందన్నారు.

MLC Kavitha

Kavitha – Congress : కాంగ్రెస్ 3 గంటల కరెంట్ కావాలా… బీఆర్ఎస్ 24 గంటల కరెంటు కావాలా అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నీళ్లు ఇచ్చేవాళ్లు కావాలా లేదా కన్నీళ్లు ఇచ్చేవాళ్లు కావాలా అని అడిగారు. రైతు బంధు కావాలా లేదా రాబంధు కావాలా అని ప్రజలు తేల్చుకోవాలన్నారు. కాంగ్రెస్ పాలనలో చూసిన దారుణమైన పరిస్థితులు కావాలా అని తెలిపారు.

కవిత నిజామాబాద్ జిల్లా నవిపేటలో రోడ్ షో, బోధన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని, మాట్లాడారు. రాహుల్ గాంధీ వచ్చి బిర్యాని, పాన్ తిని వెళ్ళిపోతారని పేర్కొన్నారు. గాంధీలు చుట్టపు చూపుగా ఇలా వచ్చి అలా పోతుంటారని తెలిపారు. అండగా నిలిచిన ప్రతిసారి గాంధీ కుటుంబం తెలంగాణను నిండా ముంచిదని విమర్శించారు.

Rahul Gandhi : కేసీఆర్ ధరణి పేరుతో పేదల భూములు లాక్కున్నారు : రాహుల్ గాంధీ

ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. తెలంగాణకు గాంధీ కుటుంబం తీరని మోసం చేసిందన్నారు. వందలాది మంది యువతను కాంగ్రెస్ పార్టీ బలి తీసుకుందని ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ ఆలస్యం కావడంతో అనేక మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారని చెప్పారుు.