Rahul Gandhi : కేసీఆర్ ధరణి పేరుతో పేదల భూములు లాక్కున్నారు : రాహుల్ గాంధీ

తెలంగాణలో కారు టైర్ పంక్ఛరైందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఒక్కటయ్యాయని ఆరోపించారు.

Rahul Gandhi : కేసీఆర్ ధరణి పేరుతో పేదల భూములు లాక్కున్నారు : రాహుల్ గాంధీ

Rahul Gandhi (6)

Rahul Gandhi – KCR : కేసీఆర్ పదేళ్లలో తెలంగాణకు ఏం చేశారని కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. తెలంగాణలో యువత భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పేరుతో పేదల భూములు లాక్కున్నారని విమర్శించారు. తెలంగాణలో దొరల సర్కార్ నడుస్తోందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహకు మద్దతుగా అందోల్ లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో రాహుల్ గాంధీ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

తెలంగాణలో కారు టైర్ పంక్ఛరైందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఒక్కటయ్యాయని ఆరోపించారు. హైదరాబాద్ ను నిర్మించింది కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఏం చేసిందన్నది ప్రశ్న కాదు.. కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని విమర్శించారు. కేసీఆర్ ప్రజా ధనం వృథా చేశారని పేర్కొన్నారు.

Revanth Reddy : పదేళ్ల కేసీఆర్ పాలనకు చరమగీతం పాడుదాం.. స్థానిక ప్రజాప్రతినిధులకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

తనపై కేసులు పెట్టారు ఇల్లు లాక్కున్నారని తెలిపారు. కేసీఆర్ కుటుంబంపై ఒక్క కేసు కూడా లేదన్నారు. తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పారు. మహిళల ఖాతాల్లో ప్రతి నెలా రూ.2500 వేస్తామని తెలిపారు. రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని పేర్కొన్నారు.

రైతులకు ఎకరాకు రూ.15 వేలు రైతు భరోసా ఇస్తామని చెప్పారు. ప్రతి మండలంలో ఇంటర్ నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు. కేసీఆర్ కు మోదీ సంపూర్ణ మద్దతు ఉందన్నారు. పార్లమెంట్ లో బీజేపీ బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్ ను ఓడించడమే తన లక్ష్యం అన్నారు.