Revanth Reddy : పదేళ్ల కేసీఆర్ పాలనకు చరమగీతం పాడుదాం.. స్థానిక ప్రజాప్రతినిధులకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో స్థానిక ప్రజాప్రతినిధులు పడుతున్న అవస్థలు, వారికి జరిగిన అవమానాలు తనకు తెలుసన్నారు. ప్రజాక్షేత్రంలో స్థానిక ప్రజాప్రతినిధులను కేసీఆర్ పురుగుల కంటే హీనంగా చూశారని పేర్కొన్నారు.

Revanth Reddy : పదేళ్ల కేసీఆర్ పాలనకు చరమగీతం పాడుదాం.. స్థానిక ప్రజాప్రతినిధులకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

Revanth Reddy open letter

Revanth Reddy Open Letter : తెలంగాణ రాష్ట్ర స్థానిక ప్రజాప్రతినిధులకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో స్థానిక ప్రజాప్రతిందుల దుస్థితిపై లేఖ రాశారు. జెడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన తనకు స్థానిక ప్రజాప్రతినిధుల బాధ్యత ఏంటో తెలుసన్నారు. ఏ ప్రభుత్వ పాలనకైనా స్థానిక ప్రజాప్రతినిధులే పునాదులు అన్నారు.

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో స్థానిక ప్రజాప్రతినిధులు పడుతున్న అవస్థలు, వారికి జరిగిన అవమానాలు తనకు తెలుసన్నారు. ప్రజాక్షేత్రంలో స్థానిక ప్రజాప్రతినిధులను కేసీఆర్ పురుగుల కంటే హీనంగా చూశారని పేర్కొన్నారు. నిర్ణయాధికారం లేక, నిధులు రాక స్థానిక ప్రజాప్రతినిధులు పడిన బాధలు గుర్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ నిధులు రాకున్నా భార్య మెడలో బంగారం అమ్మి అభివృద్ధి చేసిన వాళ్లు ఉన్నారని పేర్కొన్నారు.

CM KCR : సీఎం కేసీఆర్ కు ఈసీ నోటీసులు.. ప్రజలను రెచ్చ గొట్టే విధంగా ప్రసంగించొద్దని హెచ్చరిక

ఊరి కోసం అప్పు చేసి వడ్డీలు చెల్లించలేక కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారని వెల్లడించారు. మరికొందరు ఉపాధి హామీ కూలీలుగా, వాచ్ మెన్ లుగా చేస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి దుర్ఘటనలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో నవంబర్ 30న ఎన్నికలు జరగబోతున్నాయని తెలిపారు.

ఈ ఎన్నికల్లో స్థానిక ప్రజాప్రతినిధుల పాత్ర అత్యంత కీలకం అన్నారు. పార్టీలు, జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టాలని వారి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఇదొక అవకాశమని చెప్పారు. భవిష్యత్ లో స్థానిక ప్రజాప్రతినిధుల కష్టాలు తీర్చి, వారి గౌరవాన్ని పెంచే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

Rahul Gandhi : కేసీఆర్ పదేళ్ల పాలనలో నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం : రాహుల్ గాంధీ

కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థలకు పూర్వవైభవాన్ని తీసుకొస్తుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ – కేసీఆర్ పాలనకు చరమగీతం పాడుదామని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు స్థానిక ప్రజాప్రతినిధులు వారి వంతు పాత్ర పోషించాలని కోరారు.

పల్లె రుణం తీర్చుకునే అవకాశం కాంగ్రెస్ ఇస్తుందన్నారు. పార్టీలకు, జెండాలకు, ఎజెండాలకు అతీతంగా వార్డు సభ్యుడు నుంచి సర్పంచ్ వరకు, కౌన్సిలర్ నుంచి మున్సిపల్ చైర్మన్ వరకు, కార్పొరేటర్ నుంచి మేయర్ల వరకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు.