Rahul Gandhi : కేసీఆర్ పదేళ్ల పాలనలో నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం : రాహుల్ గాంధీ

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే, 2 లక్షల నియామకాలను పూర్తి చేసి యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని తెలిపారు.

Rahul Gandhi : కేసీఆర్ పదేళ్ల పాలనలో నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం : రాహుల్ గాంధీ

Rahul Gandhi

Updated On : November 26, 2023 / 8:09 AM IST

Rahul Gandhi – KCR : కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ యువతకు తీవ్ర న్యాయం జరిగిందని కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. ఈ మేరకు రాహుల్ ట్విట్టర్ వేదికగా కేసీఆర్ పై విమర్శలు చేశారు. నోటిఫికేషన్లు లేక, కోర్టు కేసులతో, పేపరు లీకులతో 30 లక్షల మంది నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయారని ట్వీట్ చేశారు. నిరుద్యోగ యువత కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలోనే వారికి కొలువులు రాని దుస్థితి నెలకొందన్నారు.

హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతోన్న యువతను తాను కలిశానని చెప్పారు. తెలంగాణ వస్తే తమకు కొలువులు వస్తాయని ఆశించామని కానీ, రాష్ట్రం వచ్చి పదేళ్లైనా తమ ఆకాంక్షలు నెరవేరలేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేయడం తనను కలిచివేసిందన్నారు.

Telangana Assembly Election 2023 : ఆస్తులు, కేసుల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులే అధికం…ఏడీఆర్ సంచలన నివేదిక వెల్లడి

అందుకే నిరుద్యోగుల కలలు సాకారం అయ్యేలా కాంగ్రెస్ పార్టీ రూపొందించిన జాబ్ క్యాలెండరును వారికి చూపించి వారిలో భరోసా నింపే ప్రయత్నం చేశానని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే, 2 లక్షల నియామకాలను పూర్తి చేసి యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని తెలిపారు.