Cyber Crime : ఆ నెంబర్ నుంచి వీడియో కాల్ వచ్చిందా? లిఫ్ట్ చేశారో ఇక అంతే- పోలీసుల వార్నింగ్

చాలామంది బాధితులు సైబర్ క్రిమినల్స్ బెదిరింపులకు లొంగిపోతున్నారు. వాళ్లు కోరినట్లుగా డబ్బులు ఇస్తూ ఆర్థిక ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. Cyber Crime Alert

Cyber Crime Alert : గుర్తు తెలియని నెంబర్ నుంచి వీడియో వస్తే తస్మాత్ జాగ్రత్త అంటున్నారు పోలీసులు. అవును.. వీడియో కాల్ రాగానే ఎవరో ఏంటో చూడకుండా వెంటనే ఎత్తారంటే అడ్డంగా బుక్ అయినట్టే అంటున్నారు. వీడియో కాల్ లిఫ్ట్ చేశారంటే మీకు తెలియకుండానే సైబర్ నేరగాళ్లకు దొరికిపోయినట్లే. చెయ్యని నేరానికి శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఆ వీడియో కాల్ తో మన తలరాతే మారిపోతుంది. డబ్బుతో పాటు పరువు కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఇలాంటి సమస్య సామాన్యులకే కాదు.. సినిమా సెలెబ్రిటీల నుంచి సమాజంలో పలుకుబడి ఉండే రాజకీయ నేతలు, శాంతి భద్రతలు పరిరక్షించే అధికారులు, చివరికి పోలీసులు కూడా ఈ విష వలయంలో చిక్కుకుపోతున్నారు.

సైబర్ క్రైమ్ వలలో ఐపీఎస్..
తాజాగా ఈ జాబితాలో చేరారు ఓ ప్రొబేషనరీ ఐపీఎస్. నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ప్రొబేషనరీ ఐపీఎస్ ఒకరు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నారు. వాట్సాప్ లో ఆయనకు ఒక వీడియో కాల్ వచ్చింది. వీడియో కాల్ లో యువతి నగ్నంగా కనిపించింది. ఆ వీడియో కాల్ ను చూసి వెంటనే ఆయన కట్ చేశారు. కానీ, అప్పటికే ఆ యువతి కాల్ ను రికార్డ్ చేసింది.

Also Read : సైబర్ క్రైమ్ వలలో చిక్కిన ప్రొబేషనరి ఐపీఎస్.. న్యూడ్ కాల్ రికార్డు చేసి డబ్బులు డిమాండ్ చేసిన యువతి

నగ్నంగా యువతి.. కట్ చేస్తే..
ఇక అప్పటి నుంచి ప్రొబేషనరీ ఐపీఎస్ కు సమస్యలు మొదలయ్యాయి. రికార్డ్ చేసిన వీడియో కాల్ ను ఆయనకు పంపి డబ్బు డిమాండ్ చేయడం మొదలు పెట్టారు సైబర్ నేరగాళ్లు. అయితే అందరిలా ఆయన భయాందోళన చెందలేదు. వారి బ్లాక్ మెయిల్ కు తలొగ్గలేదు. నేరుగా సైబర్ క్రైమ్ పోలీసుల దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేశారు. ప్రొబేషనరీ ఐపీఎస్ కావడంతో ధైర్యంగా ఆయన ఫిర్యాదు చేశారు.

అడిగినంత డబ్బు ఇచ్చినా..
అయితే, చాలామంది బాధితులు సైబర్ క్రిమినల్స్ బెదిరింపులకు లొంగిపోతున్నారు. వాళ్లు కోరినట్లుగా డబ్బులు ఇస్తూ ఆర్థిక ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. యువకులతో పాటు మధ్య వయస్కులనే కాదు వృద్దులను కూడా క్రిమినల్స్ వదలడం లేదు. చాలా కేసుల్లో బాధితులు లక్షలకు లక్షలు సైబర్ నేరగాళ్లకు సమర్పించుకుంటున్నారు.

Also Read : కుటుంబసభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమ పెళ్లి చేసుకున్న జంట…మూడు రోజుల తర్వాత ఏమైందంటే

గుర్తు తెలియని నెంబర్లతో జాగ్రత్త..
ఆ తర్వాత కూడా బ్లాక్ మెయిల్ ఆగకపోవడంతో అప్పుడు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాంటి బెదిరింపులకు లొంగవద్దని, నేరుగా తమకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే ఫోన్స్ కాల్స్, వీడియో కాల్స్ తీయవద్దని.. వాట్సాప్ వీడియో కాల్స్ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ట్రెండింగ్ వార్తలు