Drug Analyzer : డ్రంకెన్‌ డ్రైవ్‌ తరహాలో ఇక డ్రగ్‌ టెస్టులు.. నిమిషాల్లోనే రిజల్ట్.. హైదరాబాద్ పోలీసుల కసరత్తు

డ్రంకెన్‌ డ్రైవ్‌ తరహాలో ఇక డ్రగ్‌ టెస్టులు చేయనున్నారు. ఇందుకోసం డ్రగ్ ఎనలైజర్లను వాడనున్నారు. నిమిషాల్లోనే పట్టేయనున్నారు.(Drug Analyzer)

Drug Analyzer : డ్రగ్స్ వినియోగంపై ఉక్కుపాదం మోపే దిశగా హైదరాబాద్ పోలీసులు ఫోకస్ పెట్టారు. డ్రగ్స్ తీసుకునే వాళ్ల ఆట కట్టించేందుకు కొత్త టెక్నాలజీని వినియోగించున్నారు. ఇందులో భాగంగా డ్రంకెన్‌ డ్రైవ్‌ తరహాలో ఇక డ్రగ్‌ టెస్టులు చేయనున్నారు. ఇందుకోసం డ్రగ్ ఎనలైజర్లను వాడనున్నారు. డ్రగ్ అనలైజర్ ద్వారా నోట్లోని లాలాజలంతో టెస్ట్ చేస్తారు. 2 నిమిషాల్లోనే రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ లో పాజిటివ్‌ వస్తే వెంటే మూత్రం, రక్త నమూనాలు సేకరిస్తారు. వాటిని పరీక్షిస్తారు. ఆ పరీక్షలతో డ్రగ్స్ తీసుకున్నది లేనిదీ నిర్ధారణ చేస్తారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీసులు కసరత్తు చేస్తున్నారు.

ఇందుకోసం డ్రగ్ ఎనలైజర్లను కొనుగోలు చేయాలని పోలీసులు యోచిస్తున్నారు. వీటి ద్వారా ఉమ్ము, మూత్రం శాంపిళ్లను సేకరించి నిమిషాల్లోనే డ్రగ్ టెస్ట్ చేసి గుర్తించనున్నారు. డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ లాగే డ్రగ్స్ ను కట్టడి చేసేందుకు ముఖ్య ప్రాంతాల్లో డ్రగ్ టెస్టులు చేయాలని భావిస్తున్నారు.(Drug Analyzer)

Hyderabad Pudding And Mink Pub : మూడు టేబుళ్లపై దొరికిన కొకైన్ ఆధారంగా కేసు విచారణ

ఇప్పటికే ఈ తరహా టెస్టులు కేరళ, గుజరాత్‌ రాష్ట్రాల పోలీసులు వినియోగిస్తున్నారు. ఇలాంటి డ్రగ్‌ టెస్టుల నిర్వహణకు హైదరాబాద్ పోలీసులు కూడా కసరత్తు చేస్తున్నారు. డ్రగ్స్‌ వినియోగదారులను గుర్తించేందుకు డ్రగ్‌ అనలైజర్లు వాడనున్నారు. డ్రగ్‌ అనలైజర్లతో పరీక్షలు నిర్వహించి, వాటి ఫలితాలను పోలీసులు అధ్యయనం చేయనున్నారు. డ్రగ్‌ తీసుకుంటే ఎరుపు రంగులో లేకపోతే ఆకుపచ్చ రంగులో చుక్కలు కనిపిస్తాయి.

పరీక్షలో పాజిటివ్‌ వస్తే ఆ వ్యక్తి మూత్రం నమూనాలు తీసుకుంటారు. అలాగే రక్త పరీక్షలు నిర్వహిస్తారు. ఈ డ్రగ్ అనలైజర్ల ద్వారా గంజాయి, హష్‌ ఆయిల్, కొకైన్, హెరాయిన్‌ తీసుకున్న వారిని ఇట్టే గుర్తించవచ్చని పోలీసులు తెలిపారు. లా అండ్ ఆర్డర్, టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ డ్రగ్‌ పరీక్షలు చేయనున్నారు.(Drug Analyzer)

Hyderabad Pudding And Mink Pub : బెయిల్ పిటీషన్ కొట్టివేత, 4 రోజుల పోలీసు కస్టడి

ఇప్పటికే విదేశాలతో పాటు మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వినియోగిస్తున్న డ్రగ్ హంటర్ ఎనలైజర్లను కొనుగోలు చేసేందుకు పోలీసులు ఆసక్తి చూపుతున్నారు. ఆ డిజిటల్ డివైజ్‌ల పనితీరు గురించి తెలుసుకుంటున్నారు. ప్రభుత్వ ఆమోదంతో డ్రగ్‌ ఎనలైజర్లను కొనుగోలు చేసి, ముందుగా ట్రయల్‌ రన్‌ చేయనున్నారు. ఆ తర్వాత సిబ్బందికి ట్రైనింగ్‌ ఇచ్చి రాష్ట్రవ్యాప్తంగా వాడాలని యోచిస్తున్నారు.(Drug Analyzer)

ఎలా పని చేస్తుంది..
* డ్రంకన్‌ డ్రైవ్‌ టెస్టు తరహాలోనే డ్రగ్‌ ఎనలైజర్‌‌తో చెకింగ్‌.
* ముందుగా ఉమ్మును సేకరించి డ్రగ్ ఎనలైజర్‌లో టెస్ట్ చేస్తారు.
* ఒకవేళ అందులో డ్రగ్స్ తీసుకున్నట్లు తేలితే.. వెంటనే మూత్రం శాంపిల్‌ను సేకరిస్తారు.
* ఆ తర్వాత రెండు శాంపిల్స్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తారు.
* ఆ రిపోర్టు ఆధారంగా ఏ డ్రగ్ తీసుకున్నారనేది నిర్ధారిస్తారు.
* కాగా, డ్రగ్ తీసుకున్న వ్యక్తిలో దాని కంటెంట్ మూడు నుంచి నాలుగు రోజుల వరకు ఉంటుంది.
* కాబట్టి డ్రగ్ తీసుకుని నాలుగు రోజులైనా ఎనలైజర్ ఇట్టే పట్టేస్తుంది.

ట్రెండింగ్ వార్తలు