Pudding And Mink Pub : మూడు టేబుళ్లపై దొరికిన కొకైన్ ఆధారంగా కేసు విచారణ

పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ కేసులో నిన్న..మొదటి రోజు నిందితులిద్దరినీ బంజారా హిల్స్ పోలీసులు ఆరు గంటలపాటు  విడివిడిగా విచారించారు.

Pudding And Mink Pub : మూడు టేబుళ్లపై దొరికిన కొకైన్ ఆధారంగా కేసు విచారణ

Pudding And Mink Pub Case

Pudding And Mink Pub :  పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ కేసులో నిన్న..మొదటి రోజు నిందితులిద్దరినీ బంజారా హిల్స్ పోలీసులు ఆరు గంటలపాటు  విడివిడిగా విచారించారు. ఈ సమయంలో అనిల్, అభిషేక్ ల వ్యక్తిగత సమాచారాన్ని పోలీసులు సేకరించారు. కాగా పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు అనిల్ నోరు మెదపలేదు. అనిల్, అభిషేక్ వద్ద సీజ్ చేసిన ఫోన్ కాల్ డేటా ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.

పబ్ లో పార్టనర్స్ గురించి, వారితో చేసుకున్న  అగ్రిమెంట్ పై పలు ప్రశ్నలు సంధించారు పోలీసులు. పబ్ లో దొరికిన డ్రగ్స్ గురించి అడగ్గా అనిల్ నోరు మెదపలేదు. అభిషేక్ ఫోన్ లోని కాల్ రికార్డు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పబ్ కు అటెండైన కస్టమర్ల వివరాల గురించి పోలీసులు అభిషేక్ ను విచారించారు. ఇప్పటికే గుర్తించిన 10 మంది డ్రగ్ పెడ్లర్ల కోణంలో పోలీసులు అభిషేక్ ను విచారించారు.

నేడు రెండో రోజు ఇద్దరు నిందితులను పోలీసులు విచారణ చేయనున్నారు. ఇద్దరి కాల్ డేటా పరిశీలించగా గోవాలో జరిగే పార్టీలకు తరచూ అభిషేక్ వెళ్లేవాడని తేలింది. పబ్ మేనేజర్ అనిల్ ఫోన్ లోని వాట్సప్ చాట్ లు, మెయిల్స్ ను పరిశీలించగా అందులో కోడ్ లాంగ్వెజ్ తో మెసేజ్ లు ఉన్నాయి. ఈ విషయమై పోలీసులు ఇద్దరినీ ప్రశ్నించగా సరైనా సమాధానం లభించలేదు.

ఆ కోడ్ లాంగ్వేజ్ తో ఉన్న మెసేజ్ లు డ్రగ్స్ కోసమేనని పోలీసులు గుర్తించారు. వీక్ ఎండ్ లలో ప్రత్యేక పార్టీలను అనిల్ ఏర్పాటు చేస్తుండగా…. అభిషేక్ సెలబ్రిటీలకు ఆహ్వానాలు పంపుతున్నట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. మేనేజర్ అనిల్ కను సన్నలలోనే డ్రగ్స్ సప్లై జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Also Read : Maharashtra : “RSS ఆసుపత్రిలో హిందువులకు మాత్రమే వైద్యం చేస్తారా…?”మంత్రి గడ్కరిని ప్రశ్నించిన రతన్ టాటా
ఆ మూడు టేబుల్స్ పై దొరికిన కొకైన్ పై ఈరోజు పోలీసులు ఇద్దరినీ ప్రశ్నించనున్నారు. వీరిద్దరూ  చేప్పే సమాధానాలతో ఈరోజు మరికొంత మందికి నోటీసులు ఇచ్చి   వారిని కూడా పోలీసులు విచారించనున్నారు. మొత్తంగా ఈ రోజు విచారణలో డ్రగ్స్ కు సంబంధించి మరికొంత సమాచారం నిందితుల వద్దనుంచి లభించే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.