Drugs Police
Radisson Blu pub : బంజారాహిల్స్ డ్రగ్స్ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్ కేసులో 142 మంది లిస్టును విడుదల చేశారు. 142 మంది అడ్రస్ లు, ఫోన్ నంబర్లు తీసుకుని వారికి నోటీసులు ఇచ్చారు. ఆదిత్య పమ్నయ్, సహృద్ధ్ కసిరెడ్డి, ప్రణయ్ హరిహరన్, ప్రతాప్ శ్యామ్ మీనన్, ఎన్.అనుమోల్, లక్ష్మీనరసింహారెడ్డి, అయాన్ త్రిపురనేని, భరత్ అనుమోలు, త్రిపురనేని ఆదిత్య, అఖిలేష్ యాదవ్, చలసాని వినత్ దత్, వినోద్ కుమార్, శుశృత్ రెడ్డి, ప్రణయ్ రెడ్డి, రామికిరణ్, రాజ్ కుమార్, వివేక్ సాయి, ఈశ్వర్ శంకర్, రోహన్, సుధీర్ కుమార్, ఆనంద్ రాజ్, ప్రతీక్, సత్యజిత్ రెడ్డి, ప్రణవ్ మహేశ్వరీ, హర్ష, అభిషేక్, సాహిల్ రెడ్డి, అనూజ్ గోయల్ తో పాటు ఇతరులున్నారు.
Read More : Nagababu : రాడిసన్ ఘటనపై స్పందించిన నాగబాబు
బంజారాహిల్స్‌లో టైమ్‌ను పట్టించుకోకుండా.. నిబంధనలను పాటించకుండా.. గబ్బురేపుతున్న పబ్ పని పట్టారు పోలీసులు. బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్‌పై అర్ధరాత్రి దాటిన తర్వాత దాడులు చేశారు. సమయం దాటిన తర్వాత కూడా నిర్వహిస్తున్నారనే సమాచారంతో రాడిసన్ బ్లూ హోటల్‌లో నిర్వహిస్తున్న ఫుడింగ్ ఇన్ మింగ్ పబ్‌పై రైడ్ చేశారు. అక్కడికి పోలీసులు వెళ్లేసరికి దాదాపు 150 మంది యువతీ యువకులు.. ప్రపంచంతో సంబంధం లేకుండా ఎంజాయ్ చేస్తున్నారు. రాడిసన్ బ్లూ హోటల్ పబ్‌లో పట్టుబడిన వారిలో పలువురు ప్రముఖుల పిల్లలు ఉన్నారు.
Read More : Telangana : మద్యపానాన్ని నిషేధించాలి.. నా కొడుకు బర్త్ డే పార్టీకి వెళ్లాడు
సినీ, రాజకీయ, అధికార ప్రముఖులకు చెందిన పిల్లలను అదుపులోకి తీసుకున్నారు. రాహుల్ సిప్లిగంజ్‌కు కౌన్సిలింగ్, నోటీసులు ఇచ్చి ఇంటికి పంపించారు పోలీసులు. సెలబ్రిటీల పిల్లలు ఉండటంతో ఈ కేసు సంచలనంగా మారింది. పబ్‌లో డ్రగ్స్ కూడా వాడినట్టుగా ఆధారాలు లభించాయి. పబ్‌లో కొకైన్, ఎల్‌ఎస్‌డీ, గంజాయితో నిండిన సిగరెట్లు దొరికాయి. దీంతో పబ్‌ను సీజ్ చేసిన పోలీసులు.. నిర్వాహకులతో పాటు దాదాపు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి వారందరినీ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం మీడియాకు తెలియడంతోనే హాట్‌టాపిక్‌గా మారింది. ఇందులో ప్రముఖుల పిల్లల పేర్లు బయటకు రావడంతోనే సంచలనంగా మారింది.