Telangana : మద్యపానాన్ని నిషేధించాలి.. నా కొడుకు బర్త్ డే పార్టీకి వెళ్లాడు

పట్టుబడిన వారిలో తన కొడుకు లేడని స్పష్టం చేశారు. తన కుటుంబంపై వస్తున్న ఆరోపణలు ఖండిస్తున్నట్లు, పోలీసులు నిష్పక్షపాతికంగా విచారణ జరిపించాలని...

Telangana : మద్యపానాన్ని నిషేధించాలి.. నా కొడుకు బర్త్ డే పార్టీకి వెళ్లాడు

Drugs

Anjan Kumar Yadav : తెలంగాణ రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. 2022, ఏప్రిల్ 03వ తేదీ ఆదివారం బంజారాహిల్స్‌లోని రాడిసన్‌ బ్లూ హోటల్‌పై అర్ధరాత్రి దాటిన తర్వాత దాడులు చేశారు. సమయం దాటిన తర్వాత కూడా నిర్వహిస్తున్నారనే సమాచారంతో దాడులు జరిపారు. దాదాపు 150 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇందులో ప్రముఖులు, వీఐపీ, రాజకీయ నేతల కుమారులున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ తనయుడు కూడా ఉన్నట్లు ప్రచారం జరిగింది.

Read More : Banjarahills : పబ్ లేట్‌నైట్ పార్టీ కేసులో వెలుగులోకి వీఐపీలు

ఈ సందర్భంగా ఆయనతో 10tv మాట్లాడింది. స్టార్ హోటల్స్ లో బర్త్ డే పార్టీలు జరగడం కామన్ అని తెలిపారు. పబ్ ల మీద కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సంపాదిస్తోందని, ఎక్సైజ్ ద్వారా భారీగా డబ్బులు వస్తున్నాయన్నారు. పట్టుబడిన వారిలో తన కొడుకు లేడని స్పష్టం చేశారు. తన కుటుంబంపై వస్తున్న ఆరోపణలు ఖండిస్తున్నట్లు, పోలీసులు నిష్పక్షపాతికంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పోలీసుల నుంచి తనకు ఎలాంటి సమాచారం లేదని, కొంతమంది బద్ నాం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్న వారే చేస్తున్నారని, కొడుకు మీద దుష్ప్రచారం చేస్తున్నారని మరోసారి తెలిపారు. ఫ్రెండ్స్‌తో వెళ్లిన వ్యక్తిపై అబాంఢాలు వేస్తున్నారని మండిపడ్డారు.

Read More : Hyd Pubs : డ్రగ్స్ అమ్మే వారిని ఎన్‌‌కౌంటర్ చేయండి.. కేసీఆర్‌‌కు పూర్తి మద్దతు

మరోవైపు.. పుడ్డింగ్‌ అండ్ మింక్‌ పబ్‌ కేసులో అనేక మంది ప్రముఖుల పిల్లలు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. అయితే ఈ కేసులో ఓ యువ నటుడు కూడా పోలీసులకు చిక్కాడు. ఆ హీరో ఓ ప్రముఖ సినీ కుటుంబానికి చెందిన మూడో తరం యువ హీరోగా తెలుస్తోంది. అయితే ఆ పబ్‌లో ఆ హీరో కూడా డ్రగ్స్‌ తీసుకున్నాడా? ఆ యువ హీరో ఇంకా పోలీసుల అదుపులోనే ఉన్నాడా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. పబ్‌లో కొకైన్‌, ఎల్‌ఎస్‌డీ, గంజాయితో నిండిన సిగరెట్లు దొరికాయి. దీంతో పబ్‌ను సీజ్‌ చేసిన పోలీసులు.. నిర్వాహకులతో పాటు దాదాపు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి వారందరినీ బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం మీడియాకు తెలియడంతోనే హాట్‌టాపిక్‌గా మారింది. ఇందులో ప్రముఖుల పిల్లల పేర్లు బయటకు రావడంతోనే సంచలనంగా మారింది.