Banjarahills : పబ్ లేట్‌నైట్ పార్టీ కేసులో వెలుగులోకి వీఐపీలు

ఫుడింగ్‌ ఇన్‌ మింగ్‌ పబ్‌లో డ్రగ్స్‌ పార్టీలు విచ్చలవిడిగా జరుగుతున్నాయా? సినీ, రాజకీయ ప్రముఖుల పిల్లలు రెగ్యులర్‌గా వస్తుంటారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Banjarahills : పబ్ లేట్‌నైట్ పార్టీ కేసులో వెలుగులోకి వీఐపీలు

Vip

Banjarahills : హైదరాబాద్ బంజారాహిల్స్ లోని పుడ్డింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో డ్రగ్స్‌ పార్టీ సంచలనంగా మారింది. లేట్‌నైట్ పార్టీ కేసులో వీఐపీలు వెలుగులోకి వచ్చారు. ఈ పబ్‌ను ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మాజీ ఎంపీ కుమార్తెదిగా పోలీసులు గుర్తించారు. సినీ ప్రముఖుడి కుమార్తె, ఏపీకి చెందిన ఎంపీ కుమారుడు, ఏపీకి చెందిన పోలీసు ఉన్నతాధికారి కుమార్తె, హైదరాబాద్‌ శివారుకు చెందిన మాజీ ఎమ్మెల్యే కుమారుడు, ఇటీవలే హీరోగా పరిచయమైన ప్రముఖ సినీ కుటుంబానికి చెందిన నటుడు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

పబ్‌ బాత్రూమ్‌, కిటికీలో డ్రగ్స్‌ సీజ్‌ చేయడం.. కొకైన్‌, LSD, గంజాయితో ఉన్న సిగరేట్లు, షుగర్‌ క్యాండీస్‌ మధ్యలో డ్రగ్స్‌ ఉండటం చూస్తుంటే ఈ పబ్‌లో డ్రగ్స్‌ విచ్చలవిడిగా వినియోగిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో మాజీ ఎంపీ అల్లుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఫుడింగ్‌ ఇన్‌ మింగ్‌ పబ్‌లో డ్రగ్స్‌ పార్టీలు విచ్చలవిడిగా జరుగుతున్నాయా? సినీ, రాజకీయ ప్రముఖుల పిల్లలు రెగ్యులర్‌గా వస్తుంటారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Raj Thackeray : మసీదులపై లౌడ్ స్పీకర్లు తొలగించండి-ప్రభుత్వాన్ని హెచ్చరించిన రాజ్ థాకరే

డ్రగ్స్‌కు యువకుడు బలైన రెండ్రోజులకే వెలుగులోకి డ్రగ్స్‌ పార్టీ రావడం కలకలం రేపుతోంది. మరోవైపు పబ్‌లో పట్టుబడి పోలీసుల అదుపులో ఉన్న ఆ ఆరుగురు వ్యక్తులు ఎవరు? 140 మందికి పైగా వ్యక్తులను ఇంటికి పంపిన పోలీసులు.. ఆ ఆరుగురిని ఎందుకు తమ అదుపులోనే ఉంచుకున్నారన్న ప్రశ్నలకు కూడా సమాధానం దొరకడం లేదు. ఆ ఆరుగురిలో ప్రముఖులు, ఉన్నతాధికారుల పిల్లలు ఉన్నారా? అనే సందేహాలు బలపడుతున్నాయి.

లేక ఆ ఆరుగురే డ్రగ్స్‌ వాడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారా? పబ్‌ బాత్రూమ్‌, కిటికీలో పోలీసులు సీజ్‌ చేసిన డ్రగ్స్‌ వారికి చెందినవేనా? అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అంతేగాకుండా కొకైన్‌, ఎల్‌ఎస్‌డీ, గంజాయితో ఉన్న సిగరెట్లను కూడా పోలీసులు సీజ్‌ చేశారు. వీటిని కూడా ఆ ఆరుగురుకు చెందినవేనా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.