Weather Update: మరికొన్ని రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణమే: తెలంగాణ వాతావరణశాఖ

మధ్య, ఉత్తర భారతంలో చలి తీవ్రత పెరిగిపోతుండగా.. ఆ ప్రభావం తెలంగాణపై ఉండకపోవచ్చని వాహవరణశాఖ తెలిపింది

Weather

Weather Update: తెలంగాణలో రానున్న నాలుగు రోజుల పాటు పొడి వాతావరణమే ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. మధ్య, ఉత్తర భారతంలో చలి తీవ్రత పెరిగిపోతుండగా.. ఆ ప్రభావం తెలంగాణపై ఉండకపోవచ్చని వాహవరణశాఖ తెలిపింది. తూర్పు, ఆగ్నేయ ప్రాంతాల నుంచి వీస్తున్న గాలుల కారణంగా తెలంగాణాలో పొడి వాతావరణమే ఉంటుందని తెలిపింది. మరో వైపు హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, సహా ఈశాన్య ప్రాంతాలైన సిక్కిం, డార్జీలింగ్ లకు కోల్డ్ వేవ్ హెచ్చరికలు జారీ చేసారు అధికారులు.

Aslo Read: KGF2 : ‘కేజీఎఫ్‌ 2’లో ఐటెం సాంగ్ ఇదేనా??

తెలంగాణలో సోమవారం నుంచి బుధవారం వరకు చలి తీవ్రత ఉండకపోవచ్చని పేర్కొన్న అధికారులు.. జనవరి రెండో వారం నుంచి చలి తీవ్రత పెరగొచ్చని పేర్కొన్నారు. ఆదివారం తెలంగాణ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు పరిశీలిస్తే.. హైదరాబాద్ లో కనిష్టంగా 14 డిగ్రీలు, గరిష్టంగా 28 డిగ్రీలు, కరీంనగర్ లో కనిష్టంగా 15 డిగ్రీలు, గరిష్టంగా 29 డిగ్రీలు, ఆదిలాబాద్ లో కనిష్టంగా 14 డిగ్రీలు, గరిష్టంగా 29 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అత్యల్పంగా సిర్పూర్ లో 11.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయింది.

Also read: Unstoppable With NBK : ఫోన్‌లో ఐ లవ్ యు చెప్పిన బాలయ్య.. ఓ రేంజ్‌లో 8వ ఎపిసోడ్ ప్రోమో