Dubaka by-election result : దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం చేగుంట మండలంపైనే ఆధారపడి ఉంది. ఉప ఎన్నిక ఫలితాన్ని తారుమారు చేసే కేపాసిటీ చేగుంట ఓటర్లకు ఉందని కచ్చితంగా చెప్పవచ్చు. చేగుంట ప్రజలు ఎటువైపు ఉంటే ఆవైపు బీజేపీ గానీ, టీఆర్ఎస్ గానీ గెలిచే అవకాశం ఉంది.
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం అనేది చాలా అనూహ్యరీతిలో రౌండ్ రౌండ్ కు మారిపోతోంది. 12 రౌండ్ల వరకు దాదాపు 4 వేలకు పైగా బీజేపీ లీడ్ లో ఉంది. 12 రౌండ్ వరకు టీఆర్ఎస్ ఎక్కడా ప్రభావం చూపించలేదు. మొదటి ఐదు రౌండ్లపాటు బీజేపీ స్పష్టమైన ఆధిక్యంగా కంటిన్యూగా వెళ్లి పోయింది. దుబ్బాక మండలం, అదే విధంగా దుబ్బాక మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు జరిగింది. 1 నుంచి 5 రౌండ్ వరకు దుబ్బాక మండలం మున్సిపాలిటీలో కూడా బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబర్చుతూ ముందుకు వెళ్లింది.
మిర్ దొడ్డి మండలంలో 6, 7 రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యంలోకి వచ్చింది. మిర్ దొడ్డి మండలంలో 8, 9 రౌండ్లలో మళ్లీ బీజేపీ పుంజుకుని లీడ్ లోకి వచ్చింది. 10 రౌండ్ లో టీఆర్ఎస్ లీడ్ లోకి వచ్చింది. 11వ రౌండ్ లో బీజేపీ లీడ్ లోకి వచ్చింది. 12 రౌండ్ లో తోగుట మండలంలో కాంగ్రెస్ లీడ్ లో ఉంది. అక్కడ టీఆర్ ఎస్ మూడో స్థానికి పరిమితం అయింది. 13వ రౌండ్ నుంచి ఒక్కసారిగా టీఆర్ఎస్ పార్టీ పుంజుకుంది. 13,14, 15, 16, 17, 18 రౌండ్ లో కూడా టీఆర్ఎస్ ఆధిక్యత సాధించింది.
రాయప్రోలు మండలంలో టీఆర్ఎస్ మంచి మెజారిటీ వస్తుందని పార్టీ భావిస్తూ వచ్చింది. అయితే రాయప్రోలు కౌంటింగ్ దాదాపు పూర్తి అయింది. టీఆర్ఎస్ ఊహించినంత మెజారిటీ రాలేదు. టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత కొంత మెజారిటీ సాధించారు. కాంగ్రెస్ మూడో స్థానికి పరిమతమైంది. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య హోరాహోరి పోరు సాగుతోంది. ఈ పరిస్థితి చివరి వరకు కొనసాగే అవకాశం ఉంది.
నార్సింగి, చేగుంట మండలాల్లో కౌంటింగ్ జరగాల్సివుంది. చేగుంట మండలం కీలకమైన మండలంగా చెప్పవచ్చు. 26, 282 ఓట్లు పోలయ్యాయి. చేగుంటలో లీడ్ వస్తే బీజేపీ గెలిచే అవకాశం ఉంది. లేదంటే టీఆర్ఎస్ లీడ్ తెచ్చుకుంటే గులాబీ పార్టీ గెలిచే అవకాశం ఉంది. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాన్ని చేగుంట తేల్చేస్తుంది.