ఎన్నికల వేళ.. మళ్లీ బీజేపీలో చేరనున్న మాజీ మంత్రి

BJP: దీంతో కాషాయ తీర్థం పుచ్చుకునేందుకు పెద్దిరెడ్డి అంగీకరించారు. గతంలో పెద్దిరెడ్డి..

మాజీ మంత్రి పెద్దిరెడ్డి మళ్లీ బీజేపీలో చేరనున్నారు. రేపు సాయంత్రం బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన బీజేపీలో చేరనున్నారు. హుజూర్ నగర్‌లో ఉప ఎన్నికల వేళ పెద్దిరెడ్డి బీజేపీ నుంచి బీఆర్ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఇటీవల బీజేపీలో చేరాలని పెద్దిరెడ్డిని కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఆహ్వానించారు.

దీంతో కాషాయ తీర్థం పుచ్చుకునేందుకు పెద్దిరెడ్డి అంగీకరించారు. గతంలో పెద్దిరెడ్డి టీడీపీ, నవ తెలంగాణ, ప్రజారాజ్యంలోనూ పనిచేశారు. పెద్దిరెడ్డి 1999-2004 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కార్మిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా పనిచేశారు.

ఆయన అప్పట్లో టీడీపీ నుంచి 1994లో హుజురాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999లోనూ రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2007లో నవ తెలంగాణ పార్టీలో చేరారు. అనంతరం ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. 2018లో టీటీడీ బోర్డు సభ్యుడిగా పనిచేశారు. 2019లో టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 2021లో టీఆర్‌ఎస్‌ లో చేరారు.

టీడీపీ మ్యానిఫెస్టోను ప్రజలు సీరియస్‌గా తీసుకోవడంలేదు.. ఎందుకంటే?: మంత్రి ధర్మాన 

ట్రెండింగ్ వార్తలు