తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. దీంతో పలు ప్రాంతాల్లో ఇళ్లు, అపార్ట్‌మెంట్ల నుంచి జనం పరుగులు తీశారు. విజయవాడలో కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది. జగ్గయ్యపేట పట్టణం, పరిసర గ్రామాల్లో కంపించింది భూమి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ, తిరువూరు నియోజకవర్గాల్లోని గంపలగూడెం విస్సన్నపేట మండలాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి.
రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి జిల్లాల్లో స్పల్ప భూప్రకంపనలు సంభవించాయి. రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూమి 2 సెకన్లపాటు కంపించింది. హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ స్పల్ప భూప్రకంపనలు సంభవించాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5 సెకన్లపాటు స్వల్పంగా కంపించింది భూమి. కొత్తగూడెంతో పాటు మణుగూరు, భద్రాచలం మండలాల్లో స్పల్పంగా కంపించింది. చర్ల, చింతకాని, నాగులవంచ మండలాల్లో స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. ఉదయం 7.26 గంటలకు భూమి స్పల్పంగా కనిపించింది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు భయాందోళనలు చెందారు.
అలాగే, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ములుగు కేంద్రంగా ఉదయం 7.27 గంటలకు స్వల్ప భూకంపం సంభవించిందని అధికారులు గుర్తించారు. రిక్టర్స్ స్కేలుపై 5.3 భూకంప తీవ్రత నమోదైంది.
Yoon Suk Yeol: మార్షల్ లాను ఉపసంహరించుకున్న దక్షిణ కొరియా అధ్యక్షుడు