Yoon Suk Yeol: మార్షల్ లాను ఉపసంహరించుకున్న దక్షిణ కొరియా అధ్యక్షుడు

పార్లమెంటులో సుక్‌ యోల్‌ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ ప్రతిపక్షాలు ఎమర్జెన్సీ మార్షల్‌ లాను ఎత్తివేయాలని తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకున్నాయి.

Yoon Suk Yeol: మార్షల్ లాను ఉపసంహరించుకున్న దక్షిణ కొరియా అధ్యక్షుడు

Updated On : December 4, 2024 / 7:35 AM IST

దేశంలో మార్షల్ లాను విధించిన కొన్ని గంటలకే దాన్ని ఉపసంహరించుకున్నారు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌. ప్రతిపక్షాలపై పలు ఆరోపణలు చేస్తూ యూన్‌ సుక్‌ యోల్‌ నిన్న ఎమర్జెన్సీ మార్షల్‌ లాని విధించారు.

ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాయని అన్నారు. దీంతో పార్లమెంటులో సుక్‌ యోల్‌ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ ప్రతిపక్షాలు ఎమర్జెన్సీ మార్షల్‌ లాను ఎత్తివేయాలని తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకున్నాయి.

కాగా, పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టకముందు మార్షల్‌ లా ప్రకారం.. దక్షిణకొరియా సైన్యం పార్లమెంటు సహా రాజకీయ సమావేశాలు నిర్వహించవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఎమర్జెన్సీ మార్షల్‌ లాను ధిక్కరిస్తే వారెంట్‌ లేకుండానే అరెస్టు చేస్తామని చెప్పింది.

అయినప్పటికీ పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టి ఎమర్జెన్సీ మార్షల్‌ లాను ఎత్తివేసేలా చేశారు. నిన్న దక్షిణ కొరియాలో చోటుచేసుకున్న పరిణామాలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

Vladimir Putin : ప్రధాని మోదీ ఆహ్వానం.. భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌!