Earthquake: మణుగూరులో భూ ప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు

మణుగూరులో భూకంపం రావడం ఇది మూడోసారి. అయితే, భూకంపమా లేక ఓసి బ్లాస్టింగ్‌ల వలన భూమి కంపిస్తుందా అనేవిషయాన్ని అధికారులు...

Earthquake: మణుగూరులో భూ ప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు

Manuguru Earthquake

Updated On : August 25, 2023 / 9:23 AM IST

Manuguru Earthquake: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరులో భూమి కంపించింది. శుక్రవారం తెల్లవారు జామున 4.40గంటల సమయంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూకంపం దాటికి ఐదు సెకండ్ల పాటు పలు ప్రాంతాల్లో ఇల్లు ఊగడంతో ప్రజలు భయాందోళకు గురయ్యారు. మణుగూరు మండల పరిధిలోని రాజుపేట, విఠల్ రావు నగర్, బాపనగుంట, శివలింగాపురం గ్రామాలలో భూమి కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. మణుగూరులో భూకంపం రావడం ఇది మూడోసారి. అయితే, భూకంపమా లేక ఓసి బ్లాస్టింగ్‌ల వలన భూమి కంపిస్తుందా అనేవిషయాన్ని అధికారులు నిర్ధారించడం లేదు. దీంతో మణుగూరులో ఏం జరుగుతుందోనని ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.

Telangana Congress: గాంధీభవన్‌కు పోటెత్తుతున్న ఆశావహులు.. టికెట్లకోసం భారీగా దరఖాస్తులు.. 700 దాటిన అర్జీలు..

వారం రోజుల క్రితం మణుగూరు ప్రాంతంలో భూమి కంపించింది. తాజాగా మరోసారి భూమి కంపించడంతో ఇళ్లలోని ప్రజలు ఒక్కసారిగా పరుగులు తీశారు. మణుగూరులో ఉదయం సంభవించిన భూకంపం తీవ్రత రెక్టర్ స్కేల్ పై 3.6 గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ సిస్మాలజీ వెల్లడించింది. భూ అంతర్భాగంలో 30 కిలోమీటర్లు కదలికలు సంభవించాయని తెలిపింది.