కరీంనగర్ నుంచే పోటీ చేయాలని అనుకున్నాను.. కానీ..: ఈటల రాజేందర్

Eatala Rajender: తెలంగాణ సర్కారుని కూల్చే ఆలోచన బీజేపీకి లేదని ఈటల రాజేందర్ చెప్పారు.

Eatala Rajender

‘కరీంనగర్ నుంచే పోటీ చేయాలని అనుకున్నాను.. కానీ.. అక్కడ తమ పార్టీ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ ఉండడంతో మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తున్నా’నని బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ అన్నారు. 10 టీవీ ఓపెన్‌ డిబేట్‌లో ఈటల రాజేందర్ మాట్లాడారు.

తెలంగాణ సర్కారుని కూల్చే ఆలోచన బీజేపీకి లేదని ఈటల రాజేందర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టోను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేయాలని అన్నారు. రేవంత్ రెడ్డి సీఎంగా ఐదేళ్లు ఉండాలనే తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ సర్కారుపై తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిపారు. నాలుగు నెలల్లో రూ.4 వేల కోట్లు వసూలు చేశారని చెప్పారు. బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తులకు అవకాశమే లేదని తెలిపారు.

ఈటల రాజేందర్ ఇంకా ఏం చెప్పారు?