Eatala Resignation: ఈటల రాజీనామాకు ఆమోదం

మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా.. రాజీనామాను తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆమోదించారు.

Eatala Resignation

Eatala Resignation: మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా.. రాజీనామాను తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆమోదించారు. నేటి ఉదయం 11 గంటలకు ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి లేఖను ఇచ్చారు.

లేఖను పరిశీలించిన స్పీకర్ పోచారం దానిని ఆమోదించారు. ఈ క్రమంలోనే ఈటల.. సాయంత్రం ఢిల్లీ వెళ్లి 14వ తేదీన బీజేపీలో చేరనున్నారు. ఈటల రాజీనామా ను ఆమోదించినట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి అసెంబ్లీ కార్యదర్శి సమాచారం ఇచ్చింది.  కేవలం గంటన్నర వ్యవధిలో ఈటల రాజీనామాను స్పీకర్ శ్రీనివాస్ రెడ్డి ఆమోదించారు.