Huzurabad ByPoll : దళితబంధును వెంటనే నిలిపివేయాలి.. ఈసీ ఆదేశం!

హుజూరాబాద్‌లో ఉపఎన్నిక నేపథ్యంలో దళితబంధును వెంటనే నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

Huzurabad ByPoll : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధుకు హుజూరాబాద్‌లో బ్రేక్ పడింది. హుజూరాబాద్‌లో ఉపఎన్నిక నేపథ్యంలో అక్కడి నియోజకవర్గ పరిధిలో దళితబంధును వెంటనే నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం (CEC) ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగా.. ఓటర్లు ప్రలోభాలకు లోనుకాకుండా నిర్ణయం తీసుకున్నట్టు ఈసీ వెల్లడించింది.

రేపు  (మంగళవారం) మధ్యాహ్నం 2 గంటల కల్లా దీనిపై నివేదిక అందజేయాలని ఈసీ ఆదేశించింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఈ లేఖ అందింది. ఉప ఎన్నిక తర్వాత దళితబంధును యథావిధిగా కొనసాగించవచ్చునని ఎన్నికల సంఘం స్పష్టంచేసింది.
Telangana Farmers : తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త

అక్టోబర్ 30వ తేదీ హుజూరాబాద్ ఉప ఎన్నిక జరుగనుంది. ఎన్నిల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాలేమి అమలు చేయడానికి వీలుండదు. హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినప్పటి నుంచే ఆ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది.

దళితబంధు పథకాన్ని ఉప ఎన్నిక పూర్తి అయ్యేంతవరకు అమలు చేయకూడదని లేఖలో పేర్కొంది. ఉపఎన్నిక అనంతరం ఎప్పటిలానే పథకాన్ని కొనసాగించుకోవచ్చునని ఈసీ స్పష్టం చేసింది. రాష్ట్రవాప్తంగా దళితబంధు పథకం అమల్లో ఉన్నప్పటికీ.. ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గంలో మాత్రమే ఈ పథకం నిలిచిపోనుంది.

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కేవలం ఒక్క వర్గానికి మాత్రమే మేలు చేసేలా ఈ దళితబంధును ప్రవేశపెట్టిందంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై సీఎం కేసీఆర్ కూడా అలాంటి ప్రచారం చేయొద్దని సూచించారు. అట్టడుగున ఉన్న వర్గాలకు చేయూత అందించడంలో భాగంగా దళితబంధు పథకాన్ని తీసుకొచ్చినట్టు ఆయన స్పష్టం చేశారు.

ఇదేదో ఆషామాషీ పథకం కాదన్నారు. దళితబంధుపై అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. రాబోయే కాలంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఇవాళ సీఎం కేసీఆర్ సమక్షంలో మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గులాబీ కండువా కప్పి మోత్కుపల్లిని కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు.
Fuel Prices : ఇంధన ధరలను తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నాలు

ట్రెండింగ్ వార్తలు