Fuel Prices : ఇంధన ధరలను తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నాలు

దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. సామన్యుడికి భారంగా మారిన ఇంధన ధరలను తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది.

Fuel Prices :  ఇంధన ధరలను తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నాలు

Fuel

Updated On : October 18, 2021 / 6:32 PM IST

Fuel Prices దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. సామన్యుడికి భారంగా మారిన ఇంధన ధరలను తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది.

దేశంలో పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే ప్రతిపాదనపై ఏకాభిప్రాయం కుదరని నేపథ్యంలో ఇతర మార్గాలను అన్వేషిస్తోంది కేంద్రం. ఈ మేరకు ఆర్థిక శాఖతో కేంద్రం సంప్రదింపులు జరుపుతోంది.

ఇక, సౌదీ అరేబియా నుంచి రష్యా వరకు చమురు ఉత్పత్తి చేస్తున్న పలు దేశాలతోనూ పెట్రోలియం శాఖ ఈ విషయమై చర్చలు జరుపుతోంది. అంతర్జాతీయ మార్కెట్ లో బ్యారెల్ ముడి చమురు ధర 70 డాలర్లకు మించకుండా రానున్న 3 నెలల పాటు చర్యలు చేపట్టేలా ప్రతిపాదనలు చేసింది.

ALSO READ Google Pixel 6 సిరీస్ రేపే లాంచ్.. అంతలోనే లీక్.. ధర ఎంతంటే?