Google Pixel 6 సిరీస్ రేపే లాంచ్.. అంతలోనే లీక్.. ధర ఎంతంటే?

స్మార్ట్ ఫోన్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ బ్రాండ్ పిక్సెల్ 6 సిరీస్ అక్టోబర్ 10న లాంచ్ కాబోతోంది.

Google Pixel 6 సిరీస్ రేపే లాంచ్.. అంతలోనే లీక్.. ధర ఎంతంటే?

Google Pixel 6 Series Prices For Us And Uk Leak Ahead Of Launch, Ads Surface Online

Google Pixel 6 Series Prices Leak: స్మార్ట్ ఫోన్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ బ్రాండ్ పిక్సెల్ 6 సిరీస్ (Google Pixel 6 Series)  అక్టోబర్ 10న లాంచ్ కాబోతోంది. లాంచింగ్‌కు ఒకరోజు ముందుగానే గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ ధర లీక్ అయింది. షెడ్యూల్ ప్రకారం.. లాంచింగ్ ఈవెంట్‌లో గూగుల్ పిక్సెల్‌ 6 స్మార్ట్‌ఫోన్లతో పాటుగా న్యూ పిక్సెల్‌ బడ్స్‌, పిక్సెల్‌ వాచ్‌ను కూడా గూగుల్ రిలీజ్‌ చేయనుంది. పిక్సెల్‌ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ కూడా లాంచ్‌ చేయనుంది. Google Pixel 6 and Google Pixel 6 Pro ఫోన్‌లు అక్టోబర్ 19న లాంచ్ కానున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ల డిజైన్ ఎలా ఉంటుంది ఇప్పటికే కంపెనీ వెల్లడించింది. గూగుల్ అందించే ఈ పిక్సెల్ రెండు హ్యాండ్‌సెట్‌లు కూడా గూగుల్ సొంత టెన్సర్ అయిన SoC ద్వారా రన్ అవుతున్నాయి. కొత్త లీక్‌ ప్రకారం.. Google Pixel 6 రేంజ్ ఫోన్లు అమెరికా, యూకేలో ధరల వివరాలు బయటకు వచ్చాయి.
Apple Watch Series 7 : ఆపిల్‌ వాచ్‌ సేల్స్‌.. భారీ క్యాష్ బ్యాక్ ఆఫర్లు.. ఫీచర్లు కిరాక్!

గూగుల్ పిక్సెల్ 6, గూగుల్ పిక్సెల్ 6 ప్రో ఫోన్ల యాడ్స్ కూడా ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఈ రెండు ఫోన్ల డిజైన్, ప్రధాన ఫీచర్లు కూడా లీకయ్యాయి. ట్విట్టర్ యూజర్ ఇవాన్ లీ( Evan Lei) లాంచింగ్ ముందు టార్గెట్ స్టోర్‌లో పిక్సెల్ 6 సిరీస్ ధరలు లీక్ అయినట్టు ట్వీట్ చేశారు. 128GB మోడల్ గూగుల్ పిక్సెల్ 6 ధర $ 599 (సుమారు రూ. 45,900)గా ఉంది. అలాగే గూగుల్ పిక్సెల్ 6pro 128GB స్టోరేజ్ ఆప్షన్ ధర $ 898 (సుమారు రూ. 67,500)గా ఉంది.

Tipster M. Brandon Lee కూడా అదే ధరలు ఉన్నట్టు ధ్రవీకరించింది. అదనంగా, పిక్సెల్ 6 ప్రో యూకేలో ధర కూడా టిప్‌స్టర్ Roland Quandt ద్వారా లీక్ అయింది. అమెజాన్ యూకేలో రెండు వేరియంట్‌లను 128GB స్టోరేజ్ ఆప్షన్ ధర GBP 849 (సుమారు రూ. 87,800), 256GB మోడల్ ధర GBP 949 (సుమారు రూ. 98,100)గా ఉన్నట్టు తెలుస్తోంది. పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో నవంబర్ 1 నుంచి యూకేలో సేల్స్ ప్రారంభం కానుందని టిప్‌స్టర్ వెల్లడించింది.


Google Pixel 6 and Google Pixel 6 Pro యాడ్స్@snoopytechద్వారా లీక్ అయ్యాయి రెండు ఫోన్ల ప్రధాన ఫీచర్లు రిలీజ్ అయ్యాయి. కొత్త గూగుల్ టెన్సర్ SoC, మ్యాజిక్ ఎరేజర్ ఫీచర్ (Magic Eraser feature) కూడా ఉంది. ఈ ఫీచర్ ద్వారా ఇంటర్నెట్ లేకుండా కాన్వరేషన్స్, మెసేజ్, ఫొటోలను రియల్ టైంలో లైవ్ ట్రాన్స్‌లేట్‌ చేసుకోవచ్చు. రెండు ఫోన్‌లు హోల్-పంచ్ డిస్‌ప్లేతో రానున్నాయి. టాప్ సెంటర్‌లో కట్‌అవుట్ ఉంది. ఫిషింగ్, హ్యాకింగ్‌ నుంచి అదనపు సెక్యూరిటీ కోసం సెక్యూరిటీ హబ్‌ను ఇంటిగ్రేట్ చేసింది గూగుల్.
Apple Watch Series 7 : ఇండియాలో ఈ రోజు నుంచే ఆపిల్ వాచ్ సిరీస్ 7 ప్రీ-ఆర్డర్లు..!