Chikoti Praveen : థాయ్‌లాండ్ ఘటన తరువాత చికోటీ ప్రవీణ్‌కు ఈడీ మరోసారి నోటీసులు

క్యాసినో కింగ్ చికోటీ ప్రవీణ్ తో పాటు మెదక్ డీసీసీబీ ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, సంపత్, మాధవరెడ్డిలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. వచ్చే వారం విచారణకు హాజరుకావాలని ముగ్గురిని ఆదేశించింది.

ED notices Chikoti Praveen

Chikoti Praveen : క్యాసినో కింగ్ చికోటీ ప్రవీణ్ కు ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేసారు. థాయ్ లాండ్ లో గాంబ్లింగ్ దందాలో చికోటీ ప్రవీణ్ తో 93మందిని థాయ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత చికోటీ ప్రవీణ్ అండ్ బ్యాచ్ కు బెయిల్ లభించింది. దీంతో చికోటీ థాయ్ లాండ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఈక్రమంలో థాయ్ లాండ్ ఘటన తరువాత ఈడీ అధికారులు మరోసారి చికోటీకి నోటీసులు జారీ చేశారు. చికోటీ ప్రవీణ్ తో పాటు మెదక్ డీసీసీబీ ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, సంపత్, మాధవరెడ్డిలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. వచ్చే వారం విచారణకు హాజరుకావాలని ముగ్గురిని ఆదేశించింది. థాయ్ లాండ్ గాంబ్లింగ్ దందాలో అరెస్ట్ అయినవారిలో చిట్టి దేవేందర్ రెడ్డి కూడా ఉన్నారు.

Thailand Gambling Case: థాయిలాండ్ గ్యాంబ్లింగ్ కేసులో క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్‌తో సహా 93మంది అరెస్ట్..

గతంలో క్యాసినో దందా గురించి ఈడీ చికోటీ ప్రవీణ్ ను ప్రశ్నించిన విషయం తెలిసిందే. చికోటీ ఫామ్ హౌస్ లో పెంచుతున్న జంతువుల గురించి కూడా అటవీ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. అప్పట్లో చికోటీ చీకటి బాగోతాలు అంటూ వివాదాలు వచ్చినా చికోటీ మాత్రం లైట్ తీసుకున్నారు. తాను రాజకీయాల్లో వస్తున్నానని ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు.

చికోటీ ప్రవీణ్ కు థాయ్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. థాయ్ కరెన్సీ ప్రకారం రూ.4,500 బ్యాత్స్ జరిమానా విధించింది కోర్టు. చికోటితో సహా 83మందికి బెయిల్ మంజూరైంది. వారందరి నుంచి ఫైన్ కట్టించుకుని పాస్‌పోర్టులు వెనక్కి ఇచ్చేశారు థాయ్ పోలీసులు. దీంతో వీరంతా హైదరాబాద్ చేరుకున్నారు. ఈక్రమంలో చీకోటీతో పాటు థాయ్ లో అరెస్ట్ అయినవారిలో మెదక్ డీసీసీబీ ఛైర్మన్ కు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది.దీంతో వీరు విచారణకు హాజరుకానున్నారు.

Chikoti Praveen : క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్‌ అండ్ బ్యాచ్‌కు బెయిల్ ఇచ్చిన థాయ్ కోర్టు