ఫార్ములా ఈ-కారు రేస్ కేసు.. దూకుడు పెంచిన ఏసీబీ.. రంగంలోకి ఈడీ

ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఏసీబీ విచారణ వేగవంతం చేసింది. ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడానికి సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏసీబీ డీజీ విజయ్ కుమార్ ఏర్పాటు చేశారు.

Formula E Race Case

Formula E Car Race Case : ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఈడీ రంగంలోకి దిగింది. ప్రస్తుతం ఏసీబీ ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ సహా మరో ఇద్దరిపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈడీ సైతం రంగంలోకి దిగింది. ఈ మేరకు ఏసీబీకి ఈడీ అధికారులు లేఖ రాశారు. కేటీఆర్ పై నమోదైన కేసు వివరాలు ఇవ్వాలని ఈడీ లేఖలో కోరింది. ఎఫ్ఐఆర్ కాపీతోపాటు హెచ్ఎండీఏ అకౌంట్ నుంచి ఎంత మొత్తం బదిలీ చేశారో వివరాలను ఇవ్వాలని ఈడీ కోరింది. అలాగే, దాన కిషోర్ ఫిర్యాదు కాపీ కూడా పంపించాలని కోరింది. ఇదే సమయంలో డబ్బు బదిలీలకు సంబంధించిన ట్రాన్సాక్షన్లు జరిగిన తేదీల వివరాలను ఇవ్వాలని ఏసీబీకి రాసిన లేఖలో ఈడీ కోరింది.

Also Raed: KTR: ఆ విషయం వాళ్లకు, నాకు తెలుసు..! ఏసీబీ కేసుపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

ఇప్పటికే ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఏసీబీ విచారణ వేగవంతం చేసింది. ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడానికి సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏసీబీ డీజీ విజయ్ కుమార్ ఏర్పాటు చేశారు. దీనికి సూపర్ వైజర్ గా ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి నేతృత్వంలో ఈ టీం పనిచేయనుంది. తరుణ్ జోషితోపాటు ఇన్వెస్టిగేషన్ అధికారిగా ఒక డీఎస్పీని నియమించారు. దీంతోపాటు కొంత మంది ఇన్ స్పెక్టర్లు, కొంత మంది ఏసీపీలుగా ఇందులో ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కో డిపార్ట్ మెంట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం, ప్రభుత్వ సంబంధించినటువంటి డాక్యుమెంట్లు కలెక్ట్ చేయడం వంటి వివరాలను సేకరించనున్నారు. మరోవైపు ప్రత్యేకంగా లీగల్ టీంనుసైతం ఏర్పాటు చేశారు.

Also Read: TTD: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు బిగ్‌షాక్‌.. చర్యలకు సిద్ధమైన టీటీడీ

శుక్రవారం ఉదయం ఏసీబీ ప్రధాన కార్యాలయానికి డీజీ విజయ్ కుమార్, డైరెక్టర్ తరుణ్ జోషి చేరుకున్నారు. ఇవాళ హెచ్ఎండీఏతో పాటు పలు శాఖల నుంచి ఫైల్స్ తెప్పించుకొని పరిశీలించనున్నారు. ఇదిలాఉంటే.. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని రాబోయే రెండు రోజుల్లో కేటీఆర్ కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేటీఆర్ విచారణకు హాజరైతే విచారణ చేసి పంపిస్తారా.. అరెస్టు చేస్తారా అనే అంశంపై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.