Ek Shaam Charminar ke naam : చార్మినార్ వద్ద సండే – ఫండే!

గురువారం ఉదయం చార్మినార్ ప్రాంతాన్ని ఎంపీ అసుదుద్దీన్ ఓవైసీ, అర్బన్ డెవలప్ మెంట్ విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఇతర అధికారులు పరిశీలించారు.

Charminar Sunday – Funday : ప్రతి ఆదివారం ట్యాంక్ బండ్ పై నిర్వహించే సండే – ఫండేకు ఫుల్ రెస్పాండ్ వస్తోంది. చిన్నా..పెద్దా అనే తేడా లేకుండా…ట్యాంక్ బండ్ పై కూర్చొని నగర అందాలను తిలకిస్తున్నారు. ఇక్కడకు వచ్చే ప్రజలకు మరింత ఆనందం..ఆహ్లాదం కలిగించేందుకు అధికారులు పలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలాంటి ఈ కార్యక్రమం (సండే – ఫండే)ను ఇతర ప్రదేశాల్లో కూడా నిర్వహించాలనే సూచనలు వినిపిస్తున్నాయి. ఇటీవలే చార్మినార్ వద్ద కూడా సండే – ఫండే నిర్వహించాలని మంత్రి కేటీఆర్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సూచించినట్లు అర్బన్ డెవలప్ మెంట్ విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో…అక్కడి పరిస్థితులను అంచనా వేసేందుకు ఆ ప్రాంతాన్ని సందర్శించడం జరిగిందని అరవింద్ తెలిపారు. ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.

Read More : Amazon : ప్రొడక్టులను కాపీ చేసి..ప్రమోట్ చేస్తోందా ? రాయిటర్స్ సంచలన కథనం

చార్మినార్ వద్ద సండే – ఫండే నిర్వహంచేందుకు అధికారులు కసరత్తులు జరుపుతున్నారు. గురువారం ఉదయం చార్మినార్ ప్రాంతాన్ని ఎంపీ అసుదుద్దీన్ ఓవైసీ, అర్బన్ డెవలప్ మెంట్ విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఇతర అధికారులు పరిశీలించారు. కల్చరల్ ఈవెంట్స్ నిర్వహణతో పాటు పార్కింగ్ తదితర ఏర్పాట్లు పరిశీలించారు. ఈ విషయంలో తాము ప్రజల నుంచి సలహాలు, సూచనలు కోరడం జరిగిందని అరవింద్ తెలిపారు.

Read More : DH Srinivasa Rao : మాస్క్‌, భౌతికదూరం లేకుండా ఉత్సవాల్లో డ్యాన్స్‌ చేసిన హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు

ప్రజల నుంచి మంచి స్పందన రావడం..ఇతరత్రా విషయాలను దృష్టిలో ఉంచుకుని…చార్మినార్ వద్ద సండే – ఫండే నిర్వహించాలని నిర్ణయించారు. ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ను అనుమతించరనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం చార్మినార్ లో కూడా సండే – ఫండే నిర్వహించాలని నిర్ణయించడంతో ఇక్కడ కూడా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి.

ట్రెండింగ్ వార్తలు