DH Srinivasa Rao : మాస్క్‌, భౌతికదూరం లేకుండా ఉత్సవాల్లో డ్యాన్స్‌ చేసిన హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు

కరోనా థర్డ్‌ వేవ్‌ వచ్చే ప్రమాదముంది. జనం జాగ్రత్తగా ఉండాలంటూ తెలంగాణ డీహెచ్ శ్రీనివాసరావు నిత్యం నీతులు చెప్తుంటారు. కానీ, ఆయన మాత్రం రూల్స్‌ జాన్తానై అన్నట్టు ప్రవర్తిస్తుంటారు.

DH Srinivasa Rao : మాస్క్‌, భౌతికదూరం లేకుండా ఉత్సవాల్లో డ్యాన్స్‌ చేసిన హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు

Dh Srinivas

violating Corona Rules : తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు… బతుకమ్మ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కొత్తగూడెంలో డ్యాన్సులతో అదరగొట్టారు. బుల్లెట్టు బండి పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. తోటి ఉద్యోగులతో కలిసి ఆడిపాడి… ఎంజాయ్‌ చేశారు. అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడినట్టుంది తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు వ్యవహారం. థర్డ్‌ వేవ్‌ వచ్చే ప్రమాదముంది… జనం జాగ్రత్తగా ఉండాలంటూ నిత్యం నీతులు చెప్తుంటారు శ్రీనివాసరావు. కానీ.. ఆయన మాత్రం రూల్స్‌ జాన్తానై అన్నట్టు ప్రవర్తిస్తుంటారు.

ఓ పక్క ఫెస్టివల్‌ సీజన్‌లో అలసత్వంగా ఉండొద్దని జనానికి హితబోధ చేస్తున్న డీహెచ్‌… మరోవైపు తాను మాత్రం ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తున్నారు. మాస్క్‌ ధరించకుండా.. భౌతికదూరం పాటించకుండా.. పండగల్లో పాల్గొంటున్నారు. డ్యాన్స్‌లు చేస్తూ.. స్టెప్పులు ఇరగదీస్తున్నారు. డీహెచ్‌ శ్రీనివాసరావు ఇలా చేయడం ఇదే తొలిసారి కాదు. వినాయక చవితి సమయంలోనూ ఆయన తీరుపై విమర్శలు వచ్చాయి. అప్పట్లో వినాయక నిమజ్జనంలో పాల్గొన్న డీహెచ్‌… మాస్క్‌, భౌతికదూరం లేకుండా ఆడిపాడారు. తీన్‌మార్‌ మ్యూజిక్‌కు కాలు కదిపారు.

Corona : ఇప్పటి వరకు కరోనా సోకనివారు జాగ్రత్త : టీ. ఆరోగ్య శాఖ

తాజాగా బతుకమ్మ సంబరాల్లో డీహెచ్‌ శ్రీనివాసరావు పాల్గొన్నారు. అక్కడ కరోనా రూల్స్‌ అన్నీ బ్రేక్‌ చేశారు. ఉత్సాహంగా.. ఉల్లాసంగా… ఆడిపాడారు. బుల్లెట్టు బండి సాంగ్‌కు అదరగొట్టే స్టెప్పులు వేశారు. మాస్క్‌ పెట్టుకోవాలి… ఫిజికల్‌ డిస్టెన్స్‌ మెయింటెయిన్‌ చేయాలన్న సోయి లేకుండా ప్రవర్తించారు. సాక్షాత్తూ తెలంగాణ హెల్త్‌ డైరెక్టరే ఇలా చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కరోనా విషయంలో జనానికి నీతులు చెప్పే శ్రీనివాసరావుకు… వాటిని పాటించడం తెలియదా అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

అంతకుముందు వినాయక నిమజ్జనంలోనూ ఇలాగే ప్రవర్తించారు శ్రీనివాసరావు. నిత్యం ప్రెస్‌మీట్లు పెట్టి జనం జాగ్రత్తగా ఉండాలని ఊదరగొట్టే డీహెచ్‌… తనకు మాత్రం రూల్స్‌ వర్తించవంటున్నారు. పండగల్లో డీహెచ్‌ డ్యాన్స్‌ చేయడాన్ని ఎవరూ తప్పబట్టట్లేదు. కానీ.. జనానికి మార్గదర్శకంగా ఉండాల్సిన ఆయనే… కరోనా రూల్స్‌ బ్రేక్‌ చేయడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కరోనా థర్డ్‌ వేర్‌ పేరు చెప్పి జనాన్ని భయపెడుతున్న శ్రీనివాసరావు… ముందు రూల్స్‌ పాటించడం నేర్చుకోవాలని జనం హితవు పలుకుతున్నారు.