కర్ణాటక సర్కారుకు షాక్ ఇచ్చిన కేంద్ర ఎన్నికల కమిషన్

కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని వార్తాపత్రికల్లో ప్రకటనలు జారీ చేయడంపై ఎన్నికల కమిషన్ నోటీసు జారీ చేసింది. తెలంగాణలోని పత్రికల్లో కర్ణాటక సర్కారు సాధించిన విజయాలపై ప్రకటనలు ఇవ్వడం ఏమిటని ఈసీ ప్రశ్నించింది....

Election Commission notice

Election Commission : కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని వార్తాపత్రికల్లో ప్రకటనలు జారీ చేయడంపై ఎన్నికల కమిషన్ నోటీసు జారీ చేసింది. తెలంగాణలోని పత్రికల్లో కర్ణాటక సర్కారు సాధించిన విజయాలపై ప్రకటనలు ఇవ్వడం ఏమిటని ఈసీ ప్రశ్నించింది. తాము జారీ చేసిన నోటీసుకు నవంబర్ 28 సాయంత్రం 5 గంటలలోపు సమాధానం ఇవ్వాలని ఎన్నికల సంఘం కోరింది.

ALSO READ : Telangana Assembly Election 2023 : పోటాపోటీగా ఓటరు స్లిప్పుల పంపిణీ…ఇంటింటికి కార్యకర్తల బృందాలు

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనల జారీ అంశాన్ని బీజేపీ, బీఆర్‌ఎస్‌ తమ దృష్టికి తీసుకువచ్చినట్లు ఎన్నికల కమిషన్‌ పేర్కొంది. ఇలాంటి ప్రకటనలు మోడల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లేనని ఈసీ స్పష్టం చేసింది. మోడల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడానికి దారితీసిన పరిస్థితులను వివరించాలని, తక్షణమే అటువంటి ప్రకటనలను నిలిపివేయాలని ఈసీ కర్ణాటక ప్రభుత్వాన్ని కోరింది. ఎన్నికలకు వెళ్లని రాష్ట్రాలు ఎన్నికలకు వెళ్లే రాష్ట్రాల్లో పంపిణీ అయ్యే వార్తాపత్రికలలో ప్రకటనలను ప్రచురించడానికి తప్పనిసరిగా తమ నుంచి అనుమతులను పొందాలని ఎన్నికల కమిషన్ సూచించింది.

ALSO READ : Earthquake : మూడు దేశాల్లో భారీ భూకంపం…సునామీ ముప్పు లేదు

మోడల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు కర్ణాటకలోని సమాచార, పౌర సంబంధాల శాఖ ఇన్‌ఛార్జ్ సెక్రటరీపై ఎందుకు క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదని ఎన్నికల సంఘం ప్రశ్నించింది. రైతు బంధు పథకం కింద రైతులకు తమ రబీ పంటలు పండించడానికి ఆర్థిక సహాయం పంపిణీకి సంబంధించి తెలంగాణలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఇచ్చిన అనుమతిని అంతకుముందు రోజు ఎన్నికల సంఘం ఉపసంహరించుకుంది.

ALSO READ : తెలుగులో నినాదాలు చేసిన ప్రియాంక గాంధీ..

రాష్ట్ర మంత్రి హరీశ్ రావు బహిరంగ ప్రకటన చేయడం ద్వారా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని ఉల్లంఘించారని ఎన్నికల సంఘం పేర్కొంది. బీఆర్‌ఎస్‌పై ఆంక్షలు విధించాలని కాంగ్రెస్ చేసిన అభ్యర్థన తర్వాత కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. 119 మంది సభ్యులున్న తెలంగాణ శాసనసభకు నవంబర్ 30వతేదీన ఎన్నికలు జరగనున్నాయి. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది.

ట్రెండింగ్ వార్తలు