CM KCR : సీఎం కేసీఆర్ వాహనాన్ని కూడా వదల్లేదు.. ఆపి మరీ తనిఖీలు, ఎందుకో తెలుసా

ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం చేరుకున్న బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రయాణించే ప్రగతిపథం వాహనంలో ఎన్నికల కమిషన్ అధికారులు తనిఖీ చేశారు. CM KCR Vehicle

CM KCR Vehicle

CM KCR Vehicle : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పోటీ చేసే అభ్యర్థుల వాహనాలనే కాదు ఏకంగా సీఎం కేసీఆర్ వాహనాన్ని కూడా తనిఖీ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం చేరుకున్న బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రయాణించే ప్రగతిపథం వాహనంలో ఎన్నికల కమిషన్ అధికారులు తనిఖీ చేశారు.

ఈ నెల 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ అధికారులు అలర్ట్ అయ్యారు. కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్రమ నగదు, మద్యం తరలింపుపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అక్రమ నగదు, మద్యం తరలింపు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు.

ఈ క్రమంలోనే వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. సామాన్యుల వాహనాలనే కాదు అన్ని పార్టీల కీలక నేతల వాహనాలను సైతం విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. కొత్తగూడెం సభకు వెళ్తున్న క్రమంలో.. సీఎం కేసీఆర్ ప్రయాణించే ప్రగతి పథం వాహనంలో కూడా అధికారులు తనిఖీలు నిర్వహించారు. అణువణువూ చెక్ చేశారు. అందులో ఏమీ లేదని తేలాక వాహనం ముందుకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు.

రూల్ ఈజ్ రూల్ అంటున్నారు అధికారులు. అది కామన్ మ్యాన్ అయినా రాష్ట్రానికి ముఖ్యమంత్రే అయినా.. అందరూ రూల్ పాటించాల్సిందే అంటున్నారు. తమ డ్యూటీ తాము చేసుకుంటూ పోతున్నారు అధికారులు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రచార వాహనం అని తెలిసినా.. రూల్ ప్రకారం ఆ వాహనాన్ని ఆపి అందులో తనిఖీలు చేశామని తెలిపారు. సాధారణ పౌరులైనా, సెలెబ్రిటీలైనా, రాజకీయ ప్రముఖులైనా.. అంతా తమకు సమానమే అంటున్నారు అధికారులు. అక్రమంగా మద్యం, నగదు తరలింపును అడ్డుకుని.. ఎన్నికల నిర్వహణ ప్రక్రియను సజావుగా జరిగేలా చూడటం తమ కర్తవ్యం అని తేల్చి చెప్పారు ఎన్నికల కమిషన్ అధికారులు.

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన రోజు నుంచి అధికారులు జరిపిన తనిఖీల్లో కోట్ల రూపాయల విలువైన నగదు, బంగారం, మద్యం పట్టుబడింది. సరైన పత్రాలు లేకపోవడంతో అధికారులు ఆ నగదును, బంగారాన్ని సీజ్ చేశారు. ఒకవేళ సరైన డాక్యుమెంట్స్ చూపించగలిగితే వాటిని సీజ్ చేయడం లేదు. అంతేకాదు సీజ్ చేసినా.. తిరిగి ఇచ్చేస్తున్నారు.

Also Read : నేడే బీజేపీ నాలుగో జాబితా విడుదల? జనసేనకు కేటాయించే ఆ 9 సీట్లపై ఉత్కంఠ