Endowments Department Sentiment : దేవాదాయ శాఖ వరమా? శాపమా..? మంత్రులను వెంటాడుతోన్న పదవీ గండం..

Endowments Department Sentiment : దేవాదాయ శాఖ ఎంతో కీలకమైన హోదా. భక్తుల మనోభావాలను ఏమాత్రం దెబ్బతీయకుండా దేవాలయాల నిర్వహణ, దేవాదాయ భూములు, ట్రస్టులు, నిధులు, నియామకాలు, అభివృద్ధి పనులు ఇలా ఎన్నో సున్నితమైన అంశాలు ఈ శాఖలో ఉంటాయి. ఇంతటి సున్నితమైన దేవాదాయ శాఖలో 1960ల నుంచే దేవాదాయ శాఖ మంత్రుల పదవీ కాలాల్లో మార్పులు, ప్రభుత్వ మార్పులు, రాజకీయ సంక్షోభాలు కనిపించాయి.

Endowments Department Sentiment in Telugu States

Endowments Department Sentiment : తెలుగు రాష్ట్రాల్లో దేవాదాయ శాఖ మంత్రులకు ఎందుకు కలిసి రావడం లేదు. ఈ శాఖను నిర్వహిస్తే పదవీగండం తప్పదా..? ఇదే ఇప్పుడు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. ఇప్పటివరకు దేవాదాయ శాఖ మంత్రి నిర్వహించిన వారంతా ఎలా ఉద్వాసనకు గురయ్యారు? దేవాదాయ శాఖ మంత్రిగా ఉంటే రాజకీయ కష్టాలు తప్పవా? అసలు ఈ శాఖకు ఏదైనా నెగిటివ్ సెంటిమెంట్ ఉందా?

Also Read : Vijayawada Mayor : హీటెక్కిన బెజవాడ పాలిటిక్స్‌.. టీడీపీలో ఆసక్తికరంగా మేయర్ రేసు.. పెరిగిపోతున్న ఆశావహుల జాబితా

దేవాదాయ శాఖ ఎంతో కీలకమైన హోదా. భక్తుల మనోభావాలను ఏమాత్రం దెబ్బతీయకుండా దేవాలయాల నిర్వహణ, దేవాదాయ భూములు, ట్రస్టులు, నిధులు, నియామకాలు, అభివృద్ధి పనులు ఇలా ఎన్నో సున్నితమైన అంశాలు ఈ శాఖలో ఉంటాయి. ఇంతటి సున్నితమైన దేవాదాయ శాఖలో 1960ల నుంచే దేవాదాయ శాఖ మంత్రుల పదవీ కాలాల్లో మార్పులు, ప్రభుత్వ మార్పులు, రాజకీయ సంక్షోభాలు కనిపించాయి.

ఆ జాబితాలో ముందుగా చేరిన వ్యక్తే ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా మంత్రి టిఎన్ సదాలక్ష్మి. 1962 నుంచి 1964 వరకు దేవాదాయ శాఖ నిర్వహించారు ఆమె. అయితే, ఆ సమయంలో ఆలయ పరిపాలనలో తీసుకొచ్చిన సంస్కరణల అంశం ఆమె పదవికి ఎసరు పెట్టాయి. సంస్కరణ దెబ్బకు ఆమె శాఖ మారాల్సి వచ్చింది. సదాలక్ష్మి దేవాదాయ శాఖ నుంచి సామాజిక సంక్షేమ శాఖకు మార్చారు. ఇక సదాలక్ష్మి తర్వాత ఎన్టీఆర్ హయాల్లోనూ దేవాదాయ శాఖలో తీవ్ర ప్రభావం చూపాయి.

1983లో ఆంజనేయులు మంత్రి పదవిలో ఉండగానే మరణించగా వీరభద్రరావు పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయనకి కూడా ఈ శాఖతో ఇబ్బందులు తప్పలేదు. ఆ తర్వాత 1985 నుంచి 1989 వరకు సింహాద్రి సత్యనారాయణ దేవాదాయ శాఖను విజయవంతంగా నిర్వహించారు. అయితే 1994 లో రెండోసారి కూడా దేవాదాయ శాఖను తీసుకున్నప్పటికీ టిడిపీలో వచ్చిన తిరుగుబాటు కారణాల వల్ల కేవలం తొమ్మిది నెలలకే పరిమితం కావలసి వచ్చింది.

ఆ తర్వాత వైఎస్ హయాంలోనూ దేవాదాయ శాఖ చుట్టూ వివాదాలు వెంటాడాయి. 2004 – 2005 మధ్య దేవాదాయ శాఖ నిర్వహించిన ఎం. సత్యనారాయణరావును దేవాదాయ భూములకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో ఆ శాఖ నుంచి మార్చేశారు. ఆ తర్వాత 2009లో జూపల్లి కృష్ణారావు దేవాదాయ శాఖ బాధ్యతలు చేపట్టారు. అయితే, తెలంగాణ ఉద్యమం ఉదృతమైన సమయంలో 2011 లో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన సి రామచంద్రయ్య కూడా ఈ జాబితాలోనే ఉన్నారు. 2012 నుంచి 2014 వరకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో దేవాదాయ శాఖ నిర్వహించారు. అయితే రాష్ట్ర విభజనకు ముందు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో ఆయన మంత్రిత్వ కాలం కూడా ముగిసిపోయింది. అంటే శాఖ మారినా ప్రభుత్వం మారినా రాజకీయ పరిణామాలు మారిపోయినా దేవాదాయ శాఖకు మాత్రం వివాదాల నీడ వెంటాడుతూనే వచ్చిందన్నమాట.

అప్పటివరకు ఉన్న సెంటిమెంట్‌ను.. తెలంగాణ తొలి దేవాదాయ శాఖ మంత్రిగా పి.ఇంద్రకరణ రెడ్డి 2014 నుంచి 2023 వరకు వరుసగా దేవాదాయ శాఖ నిర్వహించి ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి విజయవంతమయ్యారు. దీంతో అప్పటివరకు ఉన్న అపోహలకు ఇంద్రకరణ రెడ్డి చెక్ పెట్టినట్లయింది. అయితే, రాష్ట్రం విడిపోయిన ఏపీలో మాత్రం ఆసెంటిమెంట్ కంటిన్యూ అయింది.

2019 నుంచి 2022 వరకు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ హయాల్లో దేవాలయ అంశం చుట్టూ అనేక వివాదాలు రావడంతో ఆయన పదవి కోల్పోవాల్సి వచ్చింది. తాజాగా 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో కొండా సురేఖకు అటవీ పర్యావరణంతో పాటు దేవాదాయ శాఖ కూడా దక్కింది. అయితే, మొదటి నుంచే ఈ శాఖ ఆమెకు సాఫీగా సాగలేదు అన్న చర్చ ఉంది. యాదాద్రి ట్రస్ట్ బోర్డు వ్యవహారం, సమ్మక్క సారలమ్మ జాతర టెండర్ల అంశం, దేవాదాయ శాఖ అధికారులపై సమీక్షలు, ఆమె ఓఎస్డి వ్యవహారం.. ఇలా పలు సందర్భాల్లో శాఖ చుట్టూ రాజకీయ వివాదాలు తలెత్తాయి.

తాజాగా, పరిణామాలు తారస్థాయికి చేరాయి. కాంగ్రెస్‌లో అంతర్గత వివాదాల నేపథ్యంలో కొండా రేఖను మంత్రివర్గం నుంచి తప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు కొండా సురేఖను బర్తరఫ్ చేయడంతో ఆ శాఖ మంత్రులకు కలిసి రాదు అనే ప్రచారం మరోసారి చర్చనీయాంశమైంది. దేవుడి శాఖలో రాజకీయ గండం ఉందా? లేక రాజకీయాలే దేవుడి శాఖను గండంగా మారుస్తున్నాయా? అని తెలంగాణ పాలిటిక్స్‌లో ప్రస్తుతం జోరుగా చర్చ నడుస్తోంది.