Errabelli Dayakar Rao (Photo : Google)
Errabelli Dayakar Rao – Power Cuts: ఆంధ్రప్రదేశ్ లో కరెంటు కోతలు, భూముల ధరలపై తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాట్ కామెంట్స్ చేశారు. ఏపీలో కరెంటు లేక విద్యుత్ తీగలపై బట్టలు ఆరేసుకునే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. తెలంగాణ ఏర్పడితే కరెంటు ఉండదు అని అన్నారు. అలాంటిది ఇప్పుడు ఏపీలోనే ఆ పరిస్థితి తలెత్తిందని చెప్పారు.
పరకాల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సాలు చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ కార్యక్రమంలోనే ఆయనీ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు తెలంగాణలో ఎకరం అమ్మితే వచ్చిన డబ్బుతో ఏపీలో వంద ఎకరాలు కొనొచ్చు అన్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే ఇది సాధ్యమైందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
Also Read..Gudivada: కొడాలి నానిని ఓడించాలంటే సరైనోడు ఉండాల్సిందే.. టీడీపీ టిక్కెట్ ఎవరికి!
”మీదంతా ఎడారి ప్రాంతం అని వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కరెంటు లేక ఇబ్బంది పడతారని నాడు కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ఆంధ్రాలో కరెంటు వైర్ల మీద బట్టలు ఆరేస్తున్నారు. కేసీఆర్ విజన్ వల్లే తెలంగాణలో 24గంటల కరెంట్ సాధ్యమైంది. చంద్రబాబు దుకాణం ఎత్తేసి అవతల పడేశారు. అందుకే విజన్ ఉన్న నాయకుడే పార్టీలో చేరాలి” అని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.
Also Read..Chandrababu: నన్ను అరెస్టు చేస్తారేమో..! టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..