Talangana BJP : తెలంగాణ బీజేపీలో కీలక మార్పులు, అస్సాంలో సీఎం హిమంత బిశ్వశర్మతో ఈటల చర్చలు..

తెలంగాణ బీజేపీలో ఈటల రాజేందర్ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారుతోంది. ఈటల అస్సాంలో సీఎం హిమంతతో చర్చలు జరపటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Etala rajender assam cm himanta : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ బీజేపీలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మరి ముఖ్యంగా హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారుతోంది. ఈటలకు ఢిల్లీ అధిష్టానం నుంచి పిలుపు రావటంతో హుటాహుటీనా వెళ్లారు. ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలు ఆయనకు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీని కోసమే ఢిల్లీ పెద్దలు ఈటలను ఢిల్లీకి పిలిచారనే ప్రచారం జరుగుతున్న క్రమంలో మరో ఆసక్తికర అంశం చోటుచేసుకుంది.

ఈటల ఢిల్లీ వెళ్లినా జాతీయ అధ్యక్షుడు నడ్డా, అమిత్ షా కూడా అందుబాటులో లేరు.నడ్డా ఏపీ పర్యటనలోను…అమిత్ షా మహారాష్ట్ర, తమిళనాడు పర్యటనలోను ఉండటంతో అందుబాటులో లేరు. దీంతో అధిష్టానం పెద్దల సూచనలతో ఈటల అస్సాం వెళ్లారు. అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మతో భేటీ అయ్యారు. బీజేపీలో ట్రబుల్ షూటర్ గా పేరొందిన హిమంత బిశ్వ శర్మతో ఈటల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈటల హిమంతతో తెలంగాణ పరిస్థితులపై చర్చించారు. తెలంగాణలో అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉన్న బీజేపీ కీలకంగా వ్యవహరిస్తోంది. తెలంగాణలో గెలుపు కోసం ఎవరిని ఎలా ఉపయోగించాలా? అనే యోచనలో ఉంది. దీంట్లో భాగంగానే తెలంగాణ ఉద్యమకారుడిగా..బిసి నేతగా ఈటలను ప్రచారసారధిగా ఉపయోగించుకుంటే పార్టీకి లాభిస్తుందన్న ఆలోచనలో బీజేపీ అధిష్టానం యోచిస్తోంది. దీంట్లో భాగంగానే ఆయనకు ఎన్నికల ప్రచార బాద్యతలు అప్పగించాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.

అలాగే బీజేపీలో హిమంతకు కూడా మంచి పేరుంది. ఎన్నికల్లో కీలక వ్యూహాలతో ప్రత్యర్ధులను చిత్తు చేయటంతో ఆయన అందెవేసిన చెయిగా పేరుంది. 2015 లో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన తరువాత అసోం ఎన్నికల కమిటీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించిన హిమంతతో ఈటల చర్చలు జరిపటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇతర పార్టీ నుంచి వచ్చి బీజేపీలో చేరి ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్న హిమంత ట్రబుల్ షూటర్ విధానాలు తెలంగాణలో కూడా అవలంభించేందుకు అధిష్టానం ఈటలను అస్సాం పంపించినట్లుగా తెలుస్తోంది.

కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చి అస్సాం సీఎం అయిన హిమంత తనతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక క్యాడర్ ను కూడా బీజేపీవైపు మళ్లించటంలో కృతకృత్యుడయ్యారు. దీంతో హిమంతతో చర్చలు ఆయన వ్యూహాలు తెలంగాణలో ఫలించేలా చేయాలని బీజేపీ అధిష్టానం యోచిస్తోందా? అందుకే ఈటలను అస్సాం పంపించిందా? అనిపిస్తోంది.

 

 

 

ట్రెండింగ్ వార్తలు