Huzurabad TRS : హుజూరాబాద్ లో ముగిసిన ఈటల పర్యటన…హైదరాబాద్ కు పయనం

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజూరాబాద్ పర్యటన ముగిసింది. అనంతరం ఆయన తిరిగి హైదరాబాద్ కు పయనమయ్యారు. ఉప ఎన్నిక కంటే..ముందే హుజూరాబాద్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించేందుకు ఈటల ప్రణాళిక రచించినట్లు సమాచారం. నియోజకవర్గంలో ఈయన పాదయాత్ర చేపట్టే అవకాశం ఉంది.

Etela Rajender Tour : తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజూరాబాద్ పర్యటన ముగిసింది. అనంతరం ఆయన తిరిగి హైదరాబాద్ కు పయనమయ్యారు. ఉప ఎన్నిక కంటే..ముందే హుజూరాబాద్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించేందుకు ఈటల ప్రణాళిక రచించినట్లు సమాచారం. నియోజకవర్గంలో ఈయన పాదయాత్ర చేపట్టే అవకాశం ఉంది.

సొంత ఇలాఖా.. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఈటల పర్యటన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 2021, జూన్ 09వ తేదీ బుధవారం ఈటల రాజేందర్ రెండో రోజు పర్యటన కొనసాగింది. ఇల్లంతకుంటలో సీత రామస్వామిని దర్శించుకున్న అనంతరం లక్మాజిపల్లి, మల్యాల, వాగొడ్డురామన్నపల్లిలో ఈటల పర్యటించారు. ఆ తర్వాత హైదరాబాద్ చేరుకుని రాజీనామా చేసే అవకాశం ఉంది. తన పర్యటనతో నియోజకవర్గంలో బలం చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఈటల.
మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయినప్పటి నుంచి ఈటల రాజేందర్…నియోజకవర్గ ప్రజలతో చర్చలు జరుపుతున్నారు.

ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చర్చలు జరిపిన తర్వాత తొలిసారి మంగళవారం హుజురాబాద్‌లో పర్యటించారు. కమలాపూర్ నుంచి రోడ్‌ షో నిర్వహించారు. బైక్‌పై మద్దతుదారులతో కలిసి.. మూడు గ్రామాల్లో పర్యటించారు. ఈటల రాజేందర్‌. ప్రజలకు అభివాదం చేస్తూ.. అనుచరులను కలుపుకుని ఈటల రోడ్‌ షో చేశారు. రోడ్‌ షో సందర్భంగా అధికార పార్టీపై ఘాటు విమర్శలు చేశారు ఈటల రాజేందర్.

Read More : Kerala Gold Smuggling Case : కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కీలక నిందితుడు అరెస్ట్

ట్రెండింగ్ వార్తలు