Kerala Gold Smuggling Case : కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కీలక నిందితుడు అరెస్ట్

కేరళలో సంచలనం సృష్టించిన గోల్డ్​ స్మగ్లింగ్​ కేసులో మరో వ్యక్తిని బుధవారం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్ట్​ చేసింది.

Kerala Gold Smuggling Case : కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కీలక నిందితుడు అరెస్ట్

Kerala Gold Smuggling Case

Updated On : June 9, 2021 / 9:18 PM IST

Kerala Gold Smuggling Case దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ గోల్డ్​ స్మగ్లింగ్​ కేసులో మరో వ్యక్తిని బుధవారం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్ట్​ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితునిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మహమ్మద్​ మన్సూర్​ NIA అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్​ నుంచి వచ్చిన మన్సూర్​ను ఎన్​ఐఏ అధికారులు కాలికట్​ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నట్లు ఎన్ఐఏ ప్రతినిధి తెలిపారు.

యూఏఐలో ఉన్నప్పుడు మహమ్మద్ మన్సూర్​పై ఎన్​ఐఏ చార్జిషీట్ ఫైల్ చేసింది. ఎర్నాకుళంలోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు మన్సూర్‌పై నాన్​బెయిల్​బుల్​ వారెంట్​ను జారీ చేసింది. కొచ్చిలోని ప్రత్యేక కోర్టులో మన్సూర్ ని హాజరుపరిచిన అధికారులు.. అతడిని ఐదు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు.

కాగా, 2020 జులై 5న తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో యునైటెడ్ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE) దౌత్య కార్యాలయానికి చెందిన పార్శిల్‌లో రూ. 14.82 కోట్ల విలువైన 30 కేజీల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్​ఐఏ జులై-10,2020న కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఏడాది జనవరిలో 20 మంది నిందితులపై చార్జిషీట్ దాఖలు చేసింది. దౌత్య కార్యాలయానికి చెందిన ప్యాకేజీలో బంగారం పట్టుబడటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.