కాళేశ్వరం కమిషన్ ముందుకు ఈటల రాజేందర్.. ఆయనపై ఉన్న ఆరోపణలు ఇవే..

కాళేశ్వరం కమిషన్ విచారణను వేగవంతం చేసింది. ఇవాళ కమిషన్ ముందు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హాజరుకానున్నారు.

Kaleshwaram Commission: కాళేశ్వరం కమిషన్ విచారణను వేగవంతం చేసింది. ఇవాళ కమిషన్ ముందు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హాజరుకానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల విషయంలో కమిషన్ ఈటలను విచారించనుంది. ఉదయం 11.30గంటలకు ఈటల కమిషన్ ముందు హాజరు కానున్నారు.

Also Read: లక్షలాది ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త చెప్పిన రాష్ట్ర సర్కార్.. వాటన్నింటికి ఒకే.. అకౌంట్ చెక్ చేసుకోండి!

ఎన్డీఎస్‌ఎ రిపోర్ట్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దర్యాప్తు సంస్థలతో పాటు అధికారులు ఇచ్చిన అఫిడవిట్‌ల ఆధారంగా ఈటల రాజేందర్ కు కమిషన్ ప్రశ్నలు సందించనుంది. ఐఏఎస్‌లు, ఇంజనీర్లు ప్రధానంగా గత ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే నిర్ణయాలంటూ కమిషన్ విచారణలో వెల్లడైంది. గత ప్రభుత్వంలో ఈటల రాజేందర్ కీలకమైన ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేయడంతో.. నిధుల వినియోగానికి సంబంధించిన వివరాలను అడగాలని కమిషన్ నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటి వరకు అధికారులను మాత్రమే విచారించింది జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని కమిషన్. ఇక ఇప్పుడు రాజకీయ నేతల వంతు వచ్చింది.

మరోవైపు ఈ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులకూ కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. జూన్ 5వ తేదీనే కేసీఆర్ కమిషన్ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే, జూన్ 11వ తేదీన విచారణకు హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తి మేరకు 11వ తేదీకి వాయిదా పడింది. జూన్ 9వ తేదీన హరీష్ రావు కమిషన్ ముందు హాజరు కానున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 2024 మార్చిలో ఈ కమిషన్ ను ఏర్పాటు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవినీతి, నాణ్యత లోపాలు, బ్యారేజీలు కుంగిపోవడం వంటి సమస్యలను ఈ కమిషన్ పరిశీలిస్తోంది. ఇదిలాఉంటే.. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ దర్యాప్తు గడువును పెంచింది. దీంతో కీలక వ్యక్తులను విచారించేందుకు కమిషన్ సభ్యులకు మరింత ఎక్కువ టైమ్ దొరికింది. ఈ క్రమంలో మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ను ఇవాళ కమిషన్ ప్రశ్నంచబోతుండటం హాట్ టాపిక్ అయింది.