లక్షలాది ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త చెప్పిన రాష్ట్ర సర్కార్.. వాటన్నింటికి ఒకే.. అకౌంట్ చెక్ చేసుకోండి!

సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ఉద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది.

లక్షలాది ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త చెప్పిన రాష్ట్ర సర్కార్.. వాటన్నింటికి ఒకే.. అకౌంట్ చెక్ చేసుకోండి!

Updated On : June 6, 2025 / 7:06 AM IST

Telangana DA 2025: సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ఉద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు ఎన్నో రోజులుగా పెండింగ్ లో ఉన్న డీఏల చెల్లింపు విషయమై తుది నిర్ణయం తీసుకుంది. ఒకేసారి రెండు డీఏలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఇది లక్షలాది ఉద్యోగులకు, పెన్షనర్లకు ఊరటనివ్వనుంది.

పెండింగ్ లో ఉన్న ఐదు డీఏలలో రెండింటిని చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్య ట్రస్టు ఏర్పాటు చేయడానికి తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రతీనెలా రూ.700 కోట్ల చొప్పున ఉద్యోగుల బకాయిలు చెల్లించేందుకు ఆమోదం తెలిపింది.

తెలంగాణ కేబినెట్ నిర్ణయం ప్రకారం.. 2023 జనవరి 1వ తేదీ నుంచి పెండింగ్ లో ఉన్న ఒక డీఏను వెంటనే చెల్లించనున్నారు. ఇక.. అప్పటి నుంచి బకాయి ఉన్న ఏరియర్స్ ను 28 వాయిదాల్లో చెల్లించనుంది ప్రభుత్వం. దీంతో ఉద్యోగులకు వచ్చే నెలలో ప్రతి జీతంతో పాటు కొంతమొత్తం అదనంగా జమ అవుతుంది. కొన్ని సంఘాల అభిప్రాయం ప్రకారం.. వాయిదా చెల్లింపుల స్థానంలో ఒకేసారి మొత్తంగా ఇవ్వాలనే డిమాండ్ ఉన్నప్పటికీ, ప్రభుత్వం ప్రస్తుతానికి ఇదేసరైన విధానం అని భావిస్తోంది.
మరో డీఏను ఆర్నెళ్ల తరువాత చెల్లించాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీస్ శాఖ, హెల్త్ వర్కర్లు, రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా రిటైర్మ్ ఉద్యోగులు (పెన్షనర్లు) ఊరట లభించనుంది.

ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం వారు నెలకు రూ.500 చొప్పున చందా చెల్లిస్తే.. దానికి సమాన వాటాను ప్రభుత్వం చెల్లించి ఆ మొత్తంతో ఆరగ్య ట్రస్టును ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ ట్రస్టుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్ గా, అధికారులు, ఉద్యోగులు సభ్యులుగా ఉంటారు.

 

కేబినెట్ సమావేశం అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల బకాయిలు గత ప్రభుత్వం నుంచి మాకు వారసత్వంగా వచ్చాయని, ఈ బిల్లులను ప్రాధాన్య క్రమంలో ప్రతి నెలా రూ.700 కోట్లకు తగ్గకుండా చెల్లిస్తామని చెప్పారు. సచివాలయంలో ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగుల కోటా 12.5శాతానికి, ఉద్యోగుల మెడికల్ ఇన్ వాలిడేషన్ కమిటీ ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని అన్నారు.

ఇక నుంచి పదవీ విరణ చేసిన ఉద్యోగులను తిరిగి తీసుకోకూడదన్న ప్రతిపాదనను మంత్రిమండలి అంగీకరించింది. గ్రామ పంచాయితీల గ్రేడింగ్ ప్రకారం కార్యదర్శులకు గ్రేడింగ్ ఇవ్వనున్నామని తెలిపారు. డీపీసీ రెగ్యులర్ గా నిర్వహించి, పదోన్నతులు వచ్చేలా నిర్ణయాలు చేశామని, ఎన్నికల సమయంలో బదిలీ అయిన ఉద్యోగులను వెనక్కు తీసుకురావడంతోపాటు కారుణ్య నియామకాలన్నీ వేగంగా పూర్తి చేస్తామని చెప్పారు.