Etela Rajender : త్వరలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా ? బీజేపీలో చేరికకు రంగం సిద్ధం!

నాలుగు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్. ఢిల్లీ పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి సంతోష్ తో పాటు పలువురు నేతలను ఈటల కలిశారు.

Etela Rajender Will Join BJP : నాలుగు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్. ఢిల్లీ పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి సంతోష్ తో పాటు పలువురు నేతలను ఈటల కలిశారు. వారంలోపు బీజేపీలో చేరుతారని కమలనాథులు అంటున్నారు. హుజూరాబాద్ లోని తన అనుచరులు, అభిమానులతో మాట్లాడిన అనంతరం ఆయన రాజీనామా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 2021, జూన్ 04వ తేదీ శుక్రవారం హుజూరాబాద్ వెళ్లి అనుచరులు, అభిమానులతో భేటి అయ్యే అవకాశం కనిపిస్తోంది.

మరోవైపు…ఈటల బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతున్న వేళ.. సీనియర్ నేత పెద్దిరెడ్డి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తుండటంతో పార్టీలో దీనిపై హాట్ హాట్ చర్చ జరుగుతోంది. పెద్దిరెడ్డిని బుజ్జగించే పనిలో పడింది బీజేపీ రాష్ట్ర నాయకత్వం. ఈటల చేరికకు ఎటువంటి అడ్డంకులు లేకుండా పెద్దిరెడ్డికి నచ్చజెప్పే ప్రయత్నాల్లో నిమగ్నమైంది. పెద్దిరెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన బండి సంజయ్.. పెద్దిరెడ్డి అనుమానాలపై క్లారిటీ ఇచ్చారని.. ఈటల చేరిక పెద్దిరెడ్డి రాజకీయ భవిష్యత్తుకు అడ్డంకి కాబోదని ఆయన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరోవైపు.. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా పెద్దిరెడ్డి ఇంటికి వెళ్లి.. ఈటల చేరికపై ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది. అంతా క‌లిసి పార్టీ కోసం పని చేయాల‌ని డీకే అరుణ సూచించిన‌ట్లు సమాచారం. మరి ఈటల బీజేపీలో ఎప్పుడు చేరుతారు ? అనేది కొద్ది రోజుల్లో తెలియనుంది.

Read More : World Bicycle Day: ఆకలి కోసం కొందరు.. ఆరోగ్యం కోసం మరికొందరు.. తొక్కితే మంచిదేగా!

ట్రెండింగ్ వార్తలు