అమానుషం : చెత్త ట్రాక్టర్ లో కరోనా బాధితుల తరలింపు

  • Publish Date - August 23, 2020 / 05:18 PM IST

కరోనాపై ప్రభుత్వం ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా కొందరి తీరు మారడం లేదు. ఇంకా కరోనా బాధితుల పట్ల వివక్ష చూపుతూనే ఉన్నారు. సిద్ధిపేట జిల్లాలోని ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఇలాంటి అమానుష ఘటన చోటుచేసుకుంది.

మున్సిపాలిటీలో పని చేసే 9 మంది కార్మికులకు కరోనా పాజిటివ్ రావడంతో వారిని అధికారులు చెత్త ట్రాక్టర్ లో ఆస్పత్రికి తరలించారు. దీంతో అధికారుల తీరుపై తోటి మున్సిపల్ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల తీరుకు నిరసనగా మున్సిపల్ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు. కార్మికుల ఆందోళనకు జిల్లా కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది.