KCR : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందన్న అంశంపై భూపాలపల్లి కోర్టు కేసీఆర్, హరీశ్ కు నోటీసులు ఇచ్చింది. దీనిపై వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. భూపాలపల్లి కోర్ట్ నోటిసులు కొట్టివేయాలని తన పిటిషన్ లో కోరారు.
మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ గతంలో భూపాలపల్లి కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం గత జూలై 10న కేసీఆర్, హరీశ్‌రావులకు నోటీసులు ఇచ్చింది. కోర్టు ఇచ్చిన నోటీసులను కొట్టివేయాలని కోరుతూ తాజాగా క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ పిటిషన్..
కాళేశ్వరం ప్రాజెక్టులో ముఖ్యమైన ఆనకట్ట మేడిగడ్డ బ్యారేజ్. దీని నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ గతంలో భూపాలపల్లి కోర్టులో సామాజిక కార్యకర్త పిటిషన్ వేశారు. దీనిపై భూపాలపల్లి జిల్లా కోర్టు విచారణ చేసింది. మేడిగడ్డ బ్యారేజీపై దాఖలైన పిటిషన్‌పై విచారణకు రావాలని కేసీఆర్, హరీశ్ రావులకు భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్, హరీశ్‌రావులు హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేయడం ఆసక్తికరంగా మారింది.
Also Read : తెలంగాణ పాలిటిక్స్‌ను మలుపు తిప్పిన “పుష్ప”.. ఈ పార్టీల యుద్ధం ఏ మలుపు తిరగబోతుంది?
నోటీసులు జారీ చేసిన కోర్టు..
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి కేసీఆర్ ప్రభుత్వమే కారణం అంటూ సామాజిక కార్యకర్త భూపాలపల్లి కోర్టును ఆశ్రయించారు. ప్రజాధనం భారీగా దుర్వినియోగం అయినందున దీనిపై సమగ్ర విచారణ చేసేలా పోలీసులకు ఆదేశాలివ్వాలని తన పిటిషన్ లో కోరారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. నోటీసులు జారీ చేసింది.
Also Read : అసలు నర్సాపూర్‌లో ఏం జరుగుతోంది? ముగ్గురు నేతలు ఎవరికివారే యమునా తీరే!