×
Ad

Harish Rao: ఎన్ని నోటీసులు ఇచ్చినా వదిలి పెట్టం, వెంటపడుతూనే ఉంటాం- హరీశ్ రావు వార్నింగ్

ఈ ప్రభుత్వానికి బొగ్గు స్కాంపై సమాధానం చెప్పే దమ్ములేదని హరీశ్ రావు విరుచుకుపడ్డారు.

Harish Rao Representative Image (Image Credit To Original Source)

 

  • బొగ్గు స్కామ్ బయట పెట్టినందుకే నోటీసులు
  • ఎన్ని నోటీసులు ఇచ్చినా వదిలేది లేదు
  • ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసేదాకా వెంట పడుతూనే ఉంటాం

Harish Rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కు సిట్ నోటీసుల అంశంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. రేవంత్ సర్కార్ పై ఆయన నిప్పులు చెరిగారు. నిన్న నాకు నోటీసు ఇచ్చారు. నేడు కేటీఆర్ కి నోటీసు ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వానికి బొగ్గు స్కాంపై సమాధానం చెప్పే దమ్ములేదని హరీశ్ రావు విరుచుకుపడ్డారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా.. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసేదాకా మీ వెంట పడుతూనే ఉంటాము అని సీఎం రేవంత్ కి వార్నింగ్ ఇచ్చారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసినా మిమ్మల్ని వదిలి పెట్టం.. వెంటపడుతూనే ఉంటాము అని హరీశ్ రావు అన్నారు.

ఇక కేటీఆర్, హరీశ్ రావు ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్ కు వెళ్లనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసుల నేపథ్యంలో కేసీఆర్ తో వారిద్దరూ భేటీ కానున్నారు. ప్రస్తుతం కేటీఆర్ సిరిసిల్లలో, హరీశ్ రావు మెదక్ పర్యటనలో ఉన్నారు. సిట్ దూకుడు పెంచిన నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఎలా ముందుకు వెళ్ళాలనే దానిపై కేసీఆర్, కేటీఆర్, హరీశ్ చర్చించనున్నారు. మరోవైపు కేసీఆర్ కు సైతం సిట్ నోటీసులు ఇవ్వనుందని బీఆర్ఎస్ లో జోరుగా చర్చ జరుగుతోంది. దీంతో తదుపరి ఎలా ముందుకెళ్ళాలనే దానిపై బీఆర్ఎస్ నాయకత్వం తర్జన భర్జన చేస్తోంది.

అటు కేటీఆర్ కు నోటీసులు ఇచ్చేందుకు సిట్ అధికారులు హైదరాబాద్ నంది నగర్ లోని ఆయన నివాసానికి వెళ్లారు. అయితే, కేటీఆర్ అందుబాటులో లేకపోవడంతో సిబ్బందికి నోటీసు కాపీ ఇచ్చారు సిట్ అధికారులు.

Also Read: మున్సిపల్ ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చిన కవిత.. మా మద్దతు వారికే..