Kavitha : మున్సిపల్ ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చిన కవిత.. మా మద్దతు వారికే..

kavitha : మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి పోటీ చేయడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత క్లారిటీ ఇచ్చారు. జాగృతి ఇంకా పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారలేదని, అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు.

Kavitha : మున్సిపల్ ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చిన కవిత.. మా మద్దతు వారికే..

kavitha

Updated On : January 21, 2026 / 1:51 PM IST

Kavitha : తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఎన్నికల సంఘం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల చివరి వారంలోగా ఎన్నిలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల 20వ తేదీలోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే చైర్మన్లు, కౌన్సిలర్లకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రకటించిన అధికారులు.. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే, త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read : Wedding Season : పెళ్లిళ్ల సీజన్ వచ్చేస్తోంది.. ఫిబ్రవరి 19 నుంచి సందడి షురూ.. ఆర్నెళ్ల పాటు వివాహ శుభ ముహూర్తాల తేదీలివే..

తెలంగాణ ఉద్యమకారుడు ముచ్చర్ల సత్యనారాయణ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కవిత పాల్గొని మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీపై మీడియా ప్రశ్నించగా.. మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి పోటీ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. జాగృతి ఇంకా పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారలేదని, అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. అయితే, మున్సిపల్ ఎన్నికల్లో యువత, మహిళలు ఎక్కడ పోటీచేసినా జాగృతి మద్దతు ఇస్తుందని, ఎవరు మద్దతు కోరినా ఇస్తామని కవిత తెలిపారు. అవసరమైన చోట తనతో పాటు జాగృతి నేతలు ప్రచారం చేస్తారని చెప్పారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు బీసీలను మభ్యపెడుతున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42శాతం వాటా ఇవ్వకుండానే ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తోందని విమర్శించారు. జిల్లాల పునర్విభజన ఎప్పుడు జరిగినా సికింద్రాబాద్ జిల్లా చేయాలని కవిత అన్నారు.

ఫోన్ ట్యాపింగ్ విషయంపై కవిత స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు తుది దశకు చేరుతుందనే నమ్మకం తనకు లేదని, తనలాంటి బాధితులకు న్యాయం జరిగే అవకాశం లేదని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల సమయంలోనే ఎందుకు విచారణ చేపట్టారని కవిత ప్రశ్నించారు. కావాలనే హరీశ్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చి డైవర్షన్ చేస్తున్నారని అన్నారు.