Site icon 10TV Telugu

KTR Counter to Kavitha : కేటీఆర్ సంచలన ట్వీట్..! హరీశ్ రావుపై కవిత చేసిన ఆరోపణలకు కౌంటర్..!

KTR Kavitha

KTR: కాళేశ్వరంపై సీబీఐ విచారణకు సంబంధించిన అంశంపై ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ శ్రేణుల్లో పెను సంచలనమే రేపాయి. బీఆర్ఎస్ కీలక నేతలు హరీశ్ రావు, సంతోష్ రావులను టార్గెట్ చేస్తూ కవిత చేసిన తీవ్ర ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. ఆ ఇద్దరి వల్లే తన తండ్రి కేసీఆర్ కి చెడ్డ పేరు వచ్చిందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.

కేసీఆర్ తెలంగాణ ప్రజల కోసం పని చేస్తే ఆయన చుట్టూ ఉన్న వాళ్లు ఆస్తుల పెంచుకోవడం కోసం పనిచేశారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ మీద సీబీఐ దర్యాప్తు వేశాక పార్టీ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి అని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ వేదికగా కేసీఆర్‌ను అన్ని మాటలు అంటుంటే ఒక్కరు కూడా నోరు విప్పకపోవడం ఏంటని కవిత ప్రశ్నించారు.

కవిత చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న వేళ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఇది ఆరడుగుల బుల్లెట్ అంటూ ఎక్స్ లో బీఆర్ఎస్ పోస్ట్ చేసిన హరీశ్ రావు వీడియోను కేటీఆర్ రీట్వీట్ చేశారు.

‘ఇది మా డైనమిక్ లీడర్ హరీశ్ ఇచ్చిన మాస్టర్ క్లాస్’ అని క్యాప్షన్ ఇచ్చారు. అలాగే ‘కేసీఆర్ ప్రియశిష్యుడి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇరిగేషన్ గురించి ఎంతో నేర్చుకుని ఉంటారని ఆశిస్తున్నా’ అని చెప్పారు. హరీశ్‌ రావుపై కవిత తీవ్ర ఆరోపణల నేపథ్యంలో కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. కేటీఆర్ చేసిన ఈ ట్వీట్.. కవితకు కౌంటర్ అని చెప్పుకుంటున్నారు.

Also Read: కేసీఆర్‌పై సీబీఐ విచారణ.. హరీశ్ రావు, సంతోశ్ రావుపై కవిత సంచలన వ్యాఖ్యలు..

Exit mobile version