Huzurabad : ఏం జరుగుతోంది….ఈటల నియోజక వర్గంలో పెద్దిరెడ్డి పర్యటన

మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరటాన్ని వ్యతిరేకించిన బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి ఈ. పెద్దిరెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.    రెండు రోజుల పాటు హుజూరాబాద్ నియోజక వర్గంలో పర్యటించేందుకు ఆయన కార్యక్రమం రూపోందించుకున్నారు.

Ex Minister Peddireddy Tour In Eatala Constituency

Huzurabad  : మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరటాన్ని వ్యతిరేకించిన బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి ఈ. పెద్దిరెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.    రెండు రోజుల పాటు హుజూరాబాద్ నియోజక వర్గంలో పర్యటించేందుకు ఆయన కార్యక్రమం రూపోందించుకున్నారు.

ఇటీవల కరోన, అనారోగ్య కారణాలతో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు ఆయన  ఈరోజు, రేపు నియోజక వర్గంలో పర్యటిస్తున్నారు. రేపు అనుచరులతో సమావేశం ఏర్పాటు చేశారు. హుజూరాబాద్ నియోజక వర్గంలో పెద్దిరెడ్డి పర్యటన ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.

గతంలో రెండు సార్లు హుజూరాబాద్ నియోజక వర్గం నుంచి పెద్దిరెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈటెల బీజేపీ లోకి వస్తే మద్దతు ఇవ్వనని కూడా వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికల బరిలో ఉంటానని చెప్పిన పెద్దిరెడ్డి ప్రస్తుతం తాజా రాజకీయ పరిస్ధితులను అంచనా వేస్తూ ప్రణాళికలు రూపోందించుకుంటున్నారు.

ఈటల బీజేపీలోకి రావటంతో ఆయన నిరాశలో ఉన్నట్లు సమాచారం. ఇంతవరకు బీజేపీ నేతలు ఎవరూ తనతో మాట్లాడలేదని అసహనం వ్యక్తం చేసిన పెద్దిరెడ్డి  ఈరోజు రేపు నియోజకవర్గంలో పర్యటన చేపట్టారు.

రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉండటంతో బరిలో దిగేందుకు అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రేపు అనుచరులతో జరిగే సమావేశంలో రాజకీయ భవిష్యత్తుపై చర్చించి …15 రోజుల్లో కరీంనగర్ లో విలేకరుల సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రకటిస్తారని తెలుస్తోంది.