Thatikonda Rajaiah: పౌరుషం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి.. ముక్కు నేలకు రాసి కేసీఆర్‌ని కలవాలి.. కడియం శ్రీహరిపై రాజయ్య నిప్పులు

పార్టీ ఫిరాయింపు వ్యవహారం దుమారం రేపుతోంది. కడియం శ్రీహరిని మాజీ ఎమ్మెల్యే రాజయ్య టార్గెట్ చేశారు. బీఆర్ఎస్ లో ఉన్నారో లేదో చెప్పాలంటూ ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు.

Thatikonda Rajaiah: స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీరుపై నిప్పులు చెరిగారు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. కుక్కకున్న విశ్వాసం, ఇంగిత జ్ఞానం కూడా కడియం శ్రీహరికి లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారాయన. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే ఆ విషయాన్ని ఒప్పుకొని ముక్కు నేలకు రాసి కేసీఆర్ ని కలవాలని కడియం శ్రీహరికి సూచించారు.

కడియం శ్రీహరి బీఆర్ఎస్ లోనే ఉంటే తెలంగాణ భవన్ కు రావాలని, యూరియా సమస్యల మీద మాట్లాడాలని రాజయ్య అన్నారు. బీఆర్ఎస్ కు న్యాయం చేసే విధంగా చెంపలు వేసుకొని ముందుకొస్తే తప్పకుండా నిన్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటాము అని తాటికొండ రాజయ్య తేల్చి చెప్పారు.

కడియం శ్రీహరికి సిగ్గు, శరం, చీము, నెత్తురు ఉంటే బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన MLA పదవికి రాజీనామా చెయ్యాలి. వరంగల్ పౌరుషం ఉంటే వెంటనే రాజీనామా చేసి రా. కడియం శ్రీహరి 200 కోట్లకు అమ్ముడుపోయి కాంగ్రెస్ పార్టీలో చేరారు. టాల్ మ్యాన్ అని చెప్పుకుంటావు కదా ఏమైంది కడియం శ్రీహరి నీ పౌరుషం? కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోవడానికి భయపడుతున్నారు.

ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇప్పటివరకు స్పీకర్ కు వివరణ ఇవ్వలేదు. పార్టీ ఫిరాయించిన కడియం శ్రీహరిపై స్పీకర్ వెంటనే చర్యలు తీసుకోవాలి. లేకపోతే స్పీకర్ ను న్యాయస్థానానికి లాగుతాం” అని హెచ్చరించారు రాజయ్య.

క్లైమ్యాక్స్ కు ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్..

అటు ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ క్లైమాక్స్‌కు చేరుకుంటోంది. 10 మంది ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం స్పీకర్ నోటీసులు ఇచ్చారు. అందులో 8 మంది ఎమ్మెల్యేలు రిప్లయ్ ఇచ్చారు. తాము పార్టీ మారలేదని, బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నామని వారంతా చెప్పుకొచ్చారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరెకపూడి గాంధీ, సంజయ్, గూడెం మహిపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, కాలె యాదయ్య, తెల్లం వెంకట్రావులు ఇటీవలే స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్లు తమ ఫోటోలు మార్ఫింగ్ చేశారని కూడా ఒకరిద్దరి ఎమ్మెల్యేల వాదన.

మేము పార్టీ మారలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నాము. మేము ఎక్కడా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఆ పార్టీకి రాజీనామా చేయలేదు. అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిశాము అంటూ 8మంది ఒకేలా వివరణ ఇచ్చారట. వారి వివరణకు స్పీకర్ స్యాటిస్ ఫై అయ్యే అవకాశం ఉంది. తాము పార్టీ మారలేదని చెప్పడమే కాదు..బీఆర్ఎస్‌లోనే ఉన్నామంటున్నారు కాబట్టి..ఈ ఎనిమిది ఎమ్మెల్యేలపై వేటు పడే అవకాశం లేదన్న టాక్ వినిపిస్తోంది.

స్పీకర్ ను మరింత సమయం కోరిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు..

కాగా, ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలోనే స్పీకర్ దగ్గర ఇష్యూ పెండింగ్ లో ఉంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్ నోటీసులకు వివరణ ఇవ్వలేదు. సమాధానం ఇవ్వడానికి తమకు మరికొంత సమయం కావాలని స్పీకర్ ను కోరినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎందుకు టైమ్ కోరారన్న దానిపై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది.

Also Read: బీసీ కోటా.. రేవంత్ సర్కార్ సరికొత్త స్కెచ్? రిజర్వేషన్ల దుమారాన్ని సేఫ్‌గా దాటగలదా?