Exams postponed : తెలంగాణలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రభుత్వం విద్యాసంస్థలకు మరో మూడు రోజులపాటు సెలవులు పొడిగించిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని పలు యూనివర్సిటీల పరిధిల్లో రేపటి నుంచి శనివారం వరకు జరుగనున్న పలు పరీక్షలను వాయిదా వేశారు.
గురువారం నుంచి ఈ నెల 16వ తేదీ వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. వాయిదా పడిన పరీక్షల షెడ్యూల్ను తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు.
Agriculture Exam postponed : ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష వాయిదా..ఇంజినీరింగ్ యథాతథం
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలను కూడా వాయిదా వేశారు. గురు, శుక్రవారాల్లో జరగాల్సిన పీజీ రెండో సంవత్సరం పరీక్షలను వాయిదా వేశారు. వాయిదా పడిన పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.