గండిపేట బురదలో కూరుకుపోయిన కాస్ట్లీ కార్లు… కార్లను బైటకుతీసి… ఎక్స్ కవేటర్లు కూరుకుపోయాయి

  • Publish Date - July 28, 2020 / 07:30 PM IST

హైదరాబాద్ కు చెందిన ఓ బడా బాబుల బృందం మూడు రోజుల క్రితం చేసిన నిర్వాకం బయట పడింది. గండిపేట చెరువు మధ్యలో దావతు చేసుకునేందుకు యువకులు కార్లల్లో వెళ్లారు. అయితే తమ వాహనాలను జలాశయం మధ్యలోకి వెళ్లడంతో బురదలో దిగబడి పోయారు.

స్థానికుల సహాయంతో ఎక్స్ వేటర్లు తెప్పించి కార్లను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. చివరకు అవి బయటకు వచ్చినా ఎక్సే వేటర్లు మాత్రం బురదలో కూరుకుపోయాయి. వాటిని బయటి లాగేందుకు మరికొన్ని ఎస్కవేటర్లు, ట్రాక్టర్లు, క్రేన్లు తెప్పించాల్సివచ్చింది. ఈ తతంగమంతా మూడు రోజులుగా జరుగుతోంది.

ఇంత జరిగినా పోలీసులు, జలమండలి అధికారులు పట్టించుకోలేదు. నిజానికి గండిపేట జలాశయంలోకి వెళ్లడమే తప్పు. అలాంటిది దవాతులకు ఎవరు పర్మిషన్ ఇచ్చారని స్థానికులు మండిపడుతున్నారు.