Omicron Effect : నాంపల్లి నుమాయిష్ రద్దు

కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో నాంపల్లి నుమాయిష్ పై కీలక నిర్ణయం తీసుకుంది ఎగ్జిబిషన్ సొసైటీ. ఈ ఏడాది నుమాయిష్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

Omicron Effect

Omicron Effect : కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో నాంపల్లి నుమాయిష్ పై కీలక నిర్ణయం తీసుకుంది ఎగ్జిబిషన్ సొసైటీ. ఈ ఏడాది నుమాయిష్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలోనే తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ జీవో విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే మొదట నుమాయిష్ 10 రోజులపాటు వాయిదా వేశారు. కరోనా తీవ్రత రోజు రోజుకు పెరుగుతుండటంతో పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ గురువారం ప్రకటించింది.

చదవండి : Omicron..mask must : విజృంభిస్తున్న ఒమిక్రాన్..ఎటువంటి మాస్క్ ధరించాలి?

అయితే జనవరి 1న ప్రారంభమై ఫిబ్రవరి 15 వరకు సాగుతోంది నుమాయిష్. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసుకొని తమ వస్తువులను అమ్ముతుంటారు. ఇక నుమాయిష్‌కు ప్రతి రోజు 50 వేలమంది వస్తుంటారు. ఈ 45 రోజుల్లో దాదాపు 20 లక్షల మంది నుమాయిష్‌ను సందర్శిస్తారు. రద్దీ ఎక్కువగా ఉండటం కారణంగా ఇక్కడ ఎన్ని ఆంక్షలు పెట్టినా కరోనా కట్టడి సాధ్యం కాదని భావించిన అధికారులు, ఎగ్జిబిషన్ సొసైటీ పూర్తిగా దీనిని రద్దు చేసింది.

చదవండి : Omicron Third Wave : ఒమిక్రాన్.. థర్డ్ వేవ్‌కి ఆరంభం.. సొంత మందులు వాడొద్దు.. ఆస్పత్రుల్లో చేరొద్దు.. : DH శ్రీనివాసరావు